Maruti-Jimny Offers | ఆఫ్ రోడర్ జిమ్నీపై మారుతి భారీ ఆఫర్లు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
Maruti-Jimny Offers | భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చిన జిమ్నీ సేల్స్ అంతకంతకు పడిపోవడంతో వాటి విక్రయాలు పెంచుకోవడానికి మారుతి సుజుకి రూ.2.21 లక్షల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది.
Maruti-Jimny Offers | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీ కారు మార్కెట్లోకి తెచ్చింది. కానీ కస్టమర్లను ఆకర్షించడంలో వెనుకబడ్డ జిమ్నీ విక్రయాలు పడిపోతున్నాయి. గత జూన్‌లో మార్కెట్లోకి తెచ్చిన మారుతి జిమ్నీ ఇప్పటి వరకూ 15,476 యూనిట్లు మాత్రమే విక్రయించింది. జూన్ లో 3071, జూలైలో 3778, ఆగస్టులో 3104, సెప్టెంబర్ లో 2651, అక్టోబర్ లో 1852, గత నెలలో 1020 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆఫ్ రోడ్ మోడల్ కారు జిమ్నీలో మెరుగైన ఫీచర్లే ఉన్నా.. ధర పిరం కావడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. ధర తగ్గించాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కస్టమర్లను ఆకర్షించడానికి జిమ్నీపై మారుతి సుజుకి ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. మారుతి జిమ్నీ జెటా వేరియంట్ మీద రూ.2.21 లక్షల డిస్కౌంట్, ఆల్పా వేరియంట్ మీద రూ.1.21 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
మారుతి సుజుకి జిమ్నీ కారు రెండు వేరియంట్లు – జెటా, ఆల్ఫా వేరియంట్లలో లభ్యం అవుతోంది. జెటా మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కారు ధర రూ.12.74 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ధర రూ.13.94 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఆల్పా వేరియంట్ రూ.13.69 లక్షలు – రూ.15.06 లక్షల మధ్య పలుకుతున్నది. ఇక జిమ్నీ లిమిటెడ్ ఎడిషన్ ‘థండర్ ఎడిషన్’ మాత్రం రూ.10.74 లక్షలకే అందిస్తున్నది మారుతి సుజుకి. మహీంద్రా అండ్ మహీంద్రా థార్ కారు ధర రూ.10.98 లక్షల (ఎక్స్ షోరూమ్)కే లభిస్తుండటంతో వినియోగదారులు జిమ్నీ పట్ల ఆసక్తి చూపడం లేదు.
మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరయంట్ జిమ్నీ లీటర్ పెట్రోల్ మీద 16.94 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ 16.39 కి.మీ మైలేజీ అందిస్తోంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 105 పీఎస్ విద్యుత్, 134 ఎన్ఎం టార్క్ వెలువరిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

