Maruti Jimny | వచ్చేనెలలో మార్కెట్లోకి మారుతి జిమ్నీ.. ఈ ఎస్యూవీ ధరెంతంటే?!
Maruti Jimny | త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి ఎస్ యూవీ కారు జిమ్నీ ధర లీక్ అయింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.13.99 లక్షల మధ్య పలుకుతుందని తెలుస్తున్నది.
Maruti Jimny | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎస్యూవీ కార్ల జాబితాలో మరో కారు వచ్చి చేరుతోంది. వచ్చేనెలలో కొత్త ఎస్యూవీ వేరియంట్ జిమ్నీ కారు మార్కెట్లోకి రానున్నది. సప్త వర్ణాలు.. అల్ఫా-జేటా వేరియంట్లలో రూపుదిద్దుకుంటున్న జిమ్నీ కారును మారుతి సుజుకి తొలిసారి ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో-2023 సందర్భంగా జనవరి 12న ప్రదర్శించారు. ఇప్పటికే ఆసక్తిగల వారు ఆన్లైన్లో రూ.11 వేలు పే చేసి కార్లు బుక్ చేసుకుంటున్నారు. కేవలం రెండు రోజుల్లోనే (జనవరి 14 నాటికి) 2500 మంది కార్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక డీలర్ ఇన్వాయిస్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. దీని ప్రకారం జిమ్నీ కారు ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
త్వరలో దేశీయ మార్కెట్లోకి వచ్చేస్తున్న జిమ్నీ.. ఇంటర్నేషనల్ మార్కెట్‌కు వెళ్లడానికి కొంత టైం పడుతుంది. గ్లోబల్ మార్కెట్లో త్రీ-డోర్ వర్షన్లో కారు అందుబాటులో ఉంటుంది. అంతా ఊహించినట్లు జరిగితే 5-డోర్ల మారుతి జిమ్నీ కారు ధర రూ.9.99 లక్షల నుంచి మొదలవుతుందని తెలుస్తున్నది. రోడ్డుపైకి వచ్చేసరికి రూ.11.40 లక్షలు ఖర్చవుతుంది. ఇది బేస్ జేటా మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) వేరియంట్ ధర. టాప్ హై ఎండ్ వేరియంట్ ఆల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏటీ) వేరియంట్ ధర రూ.13.99 లక్షలు పలుకుతుందని, రోడ్డు మీదకు వచ్చేసరికి రూ.15.98 లక్షలకు చేరుతుందని సమాచారం. ఈ ధరలు ఢిల్లీలోని మారుతి షోరూమ్ వెల్లడించినవి.
వేరియంట్ ——– ధర (రూ.ల్లో) —- ఆన్ రోడ్ ప్రైస్ (సుమారు)
జెటా (ఎంటీ) —— 9.99 లక్షలు —– రూ.11.40 లక్షలు
జెటా (ఏటీ) ——– 11.59 లక్షలు —- రూ.13.45 లక్షలు
అల్ఫా (ఎంటీ) —- 12.29 లక్షలు —- రూ.13.95 లక్షలు
అల్ఫా (ఏటీ) —— 13.99 ————- రూ.15.98 లక్షలు
ఫోర్ వీల్ డ్రైవ్.. ఫైవ్ డోర్ వర్షన్
భారత్ మార్కెట్లోకి జిమ్నీ ఎస్యూవీ కారు ఫోర్ వీల్ డ్రైవ్, ఫైవ్ డోర్ వర్షన్లో వస్తున్నది. 1.5 లీటర్ల కే-సిరీస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారవుతున్నది. ఈ ఇంజిన్ 6000 ఆర్పీఎం వద్ద 104 బీహెచ్పీ విద్యుత్, 4000 ఆర్పీఎం వద్ద 134 ఎన్ఎం టార్చి గరిష్టంగా వెలువరిస్తుంది. కే-15సీ మిల్ స్థానే పాత 4-సిలిండర్ కే-15బీ ఇంజిన్ వస్తున్నది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ ఆల్ గ్రిప్ ప్రో 4ఎక్స్4 సిస్టమ్‌తో అందుబాటులోకి వస్తున్నది.
మారుతి జిమ్నీ ఎస్యూవీ మార్కెట్లోకి వచ్చేనాటికి బుకింగ్స్ పెరిగి రిజిస్టర్ చేసుకున్న వారు కారు సొంతం చేసుకోవడానికి కనీసం మూడు నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

