Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లలో అధిక రిటర్న్స్‌కు ఇదే సరైన సమయమా..? ఏ బ్యాంక్‌లో పొదుపుతో లాభం?
Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రస్తుతం బ్యాంకులన్నీ దాదాపుగా ఏడు శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. మీ మొత్తం ఆదాయం రూ.2.5 లక్షలు దాటితే పన్ను రాయితీకి ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ క్లయిమ్ చేయాల్సిందే.
Fixed Diposits | ఎస్బీఐతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లు పెంచాయి. ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు గరిష్టంగా ఏడు శాతం వడ్డీ పొందొచ్చు. ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నట్లయితే వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను చెక్ చేసుకున్న తర్వాత ఏ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చుననే విషయం నిర్ధారించుకోవచ్చు. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్లను ఓసారి పరిశీలిద్దాం.
వడ్డీరేట్లలో మార్పుల తర్వాత ఆయా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇలా
రెండేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ
బ్యాంక్ – వడ్డీరేట్ (శాతం)
ఐసీఐసీఐ-7.00
ఎస్బీఐ- 7.00
హెచ్డీఎఫ్సీ- 7.00
యస్ బ్యాంక్- 7.50
యాక్సిస్ బ్యాంక్-7.26
మూడేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ
బ్యాంక్ – వడ్డీరేట్ (శాతం)
ఐసీఐసీఐ-7.00
ఎస్బీఐ-6.50
హెచ్డీఎఫ్సీ- 7.00
యస్ బ్యాంక్- 7.00
యాక్సిస్ బ్యాంక్- 7.00
ఐదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ
బ్యాంక్ – వడ్డీరేట్ (శాతం)
ఎస్బీఐ- 6.50
హెచ్డీఎఫ్సీ-7.00
ఐసీఐసీఐ -7.00
యస్ బ్యాంక్- 7.00
యాక్సిస్ బ్యాంక్- 7.00
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి పన్ను పే చేయాల్సిందే
ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పూర్తిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఏడాది కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం మీ వార్షిక ఆదాయంలో జత కలుస్తుంది. మొత్తం మీ ఆదాయం ఆధారంగా పన్ను శ్లాబ్ ఖరారవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం.. `ఇతర మార్గాల్లో ఆదాయం` కేటగిరీలోకి వస్తుంది. టీడీఎస్ కింద పన్ను వసూలవుతుంది. మీ బ్యాంక్ ఖాతాలో `ఫిక్స్డ్ డిపాజిట్`పై వచ్చే వడ్డీ క్రెడిట్ కాగానే టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం మీద పన్ను రాయితీ పొందొచ్చు.
ఒకవేళ, ఏడాదిలో మీ ఆదాయం మొత్తం రూ.2.5 లక్షల్లోపు ఉంటే మీ ఖాతా నుంచి బ్యాంకులు టీడీఎస్ డిడక్ట్ చేయవు. అయినా, టీడీఎస్ నుంచి మినహాయింపు కోసం ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ సబ్మిట్ చేయాలి. టీడీఎస్ నుంచి ఆదా చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ సబ్మిట్ చేయాల్సిందే. ఒక ఏడాదిలో మీరు చేసిన మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.40 వేల లోపు ఉంటే బ్యాంకులు టీడీఎస్ డిడక్ట్ చేయవు. ఒకవేళ రూ.40 వేలకు పైగా వడ్డీ ఆదాయం ఉంటే మాత్రం అందులో పది శాతం టీడీఎస్ డిడక్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు పాన్ కార్డు సబ్మిట్ చేయకుంటే 20 శాతం డిడక్ట్ చేసుకునే వీలు ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

