Aeroplane-Villa | బోయింగ్ 737 విమానం.. లగ్జరీ విల్లాగా మారిపోయిందిలా….!
Aeroplane-Villa | బాలీలోని న్యాంగ్ న్యాంగ్ బీచ్ సమీపాన ఈ ఫ్లైట్ విల్లాను ఫెలిక్స్ డెమిన్ రూపొందించాడు.
Aeroplane-Villa | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎల్లవేళలా సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటారు. తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో ఆసక్తికర వీడియోనూ షేర్ చేశారు. ఒక వ్యక్తి విమానాన్ని సకల సౌకర్యాలతో విలాసవంతమైన విల్లా నివాసంగా డిజైన్ చేసిన వీడియో అది. ఇందులోనే డబుల్ బెడ్ రూమ్, వాష్ రూమ్, కారిడార్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటాయి. ‘కొందరికి తమ కలలను సాకారం చేసుకునే అద్రుష్టం ఉంటుంది. నేను ఆ విమానం విల్లాలో బస చేయడానికి తప్పక ప్రయత్నిస్తాను’ అని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు.
బాలీలోని న్యాంగ్ న్యాంగ్ బీచ్ సమీపాన ఈ ఫ్లైట్ విల్లాను ఫెలిక్స్ డెమిన్ రూపొందించాడు. సర్వీసు పూర్తయిన బోయింగ్ 737 విమానాన్ని ఫెలిక్స్ డెమిన్ దీన్ని రూపొందించాడు. ఇందులో బస చేయాలంటే 7,000 డాలర్లు ఖర్చు చేయాలని తెలుస్తున్నది. వాస్తవానికి ప్రతి ఒక్కరూ విమానంలో ప్రయాణానికి కలలు కంటూ ఉంటారు. అటువంటిది విమానాన్నే సౌకర్యవంతమైన ఇల్లుగా మార్చుకున్నాడంటే ఆ వ్యక్తిని ఎలా పొగడాలో అర్థం కావట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్నెట్ లో వైరలైన ఈ వీడియోకు ఇప్పటికే 6.4 లక్షలపై చిలుకు వ్యూస్, ఆరువేల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియా యూజర్లు ఇది కొంత అద్భుతమే, షేర్ చేసినందుకు ధన్యవాదాలు- ఇది చాలా ఆసక్తికరం, అమేజింగ్ అనే కామెంట్స్ చేశారు.
Some people are fortunate enough to be able to turn their fantasies into reality.
And this chap doesn’t seem to impose any constraints on his imagination!
I’m trying to figure out whether I’d ever be interested in booking a stay here but I’m a bit worried about jet lag post… pic.twitter.com/LhH2Rtn5Ht
— anand mahindra (@anandmahindra) February 17, 2024
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

