బీజింగ్ : రోజుకు ఆరు గంటల పాటు టాయిలెట్ బ్రేక్స్ తీసుకుంటుండంతో చైనాలో ఓ వ్యక్తి ఉద్యోగం వీడింది. ఈ ఉద్యోగిని 2014 డిసెంబర్లో మలద్వార సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకున్న వాంగ్గా గుర్తించారు. సర్జరీ గాయం మానిన నెల తర్వాత నొప్పి రావడంతో అతడి కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక 2015 జులై నుంచి వాంగ్ రోజుకు మూడు నుంచి ఆరు గంటలు టాయిలెట్లోనే గడపాల్సి వచ్చేది.
అదే ఏడాది సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 మధ్య వాంగ్ ఏకంగా 22 సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లారు. దీంతో ఫిఫ్ట్‌లో మూడు సార్లు వాంగ్ వాష్‌రూమ్‌లో గడుపుతుంటాడు. ఒక్కోసారి వాష్‌రూంలో ఏకంగా 47 నిమిషాల నుంచి 3 గంటలు పైగా గడపాల్సి వచ్చేది.
సర్వీస్ నియమాలను ఉల్లంఘించాడని వాంగ్‌ను యాజమాన్యం విధుల నుంచి తొలగించగా న్యాయస్ధానాలను ఆశ్రయించినా వాంగ్‌కు ఫలితం దక్కలేదు.టాయిలెట్స్‌లో వాంగ్ అధిక సమయం వెచ్చించడం హేతుబద్ధమైన భౌతిక అవసరాల పరిధిని దాటిందని కోర్టు పేర్కొంది. అతడిని ఉద్యోగం నుంచి సంస్ధ తొలగించడం న్యాయబద్ధమైనదేనని స్పష్టం చేసింది.
Read More
Spotify Layoffs | స్పాటిఫైలో ఆగని కొలువుల కోత : 200 మందిపై మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం వేటు