Thar vs Jimny | థార్ వర్సెస్ జిమ్నీ.. మైలేజీలో ఏది బెస్ట్.. !
Thar vs Jimny | మహీంద్రా థార్, మారుతి సుజుకి జిమ్నీ ఎస్యూవీ కార్లు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. థార్ ఆర్డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ వర్షన్లలో లభిస్తుండగా, జిమ్నీ 4డబ్ల్యూడీ వర్షన్లలో అందుబాటులో ఉంది. థార్ లీటర్ పెట్రోల్‌పై 13 కి.మీ మైలేజీ ఇస్తుండగా, జిమ్నీ 16.39 నుంచి 16.94 కి.మీ మైలేజీ ఇస్తున్నది.
Thar vs Jimny | మారుతి సుజుకి జిమ్నీ, మహీంద్రా థార్.. రెండూ ఆఫ్-రోడ్ ఎస్యూవీ కార్లే. ఇప్పటికే మార్కెట్లో పోటాపోటీగా దూసుకెళ్తున్న జిమ్నీ, థార్ మధ్య ధరల తేడాలపై విశ్లేషణ సాగింది. ఇప్పుడు రెండు కార్లు ఇచ్చే మైలేజీ ఎలా ఉంటుందో చూద్దాం.. ఇటు మారుతి జిమ్నీ, అటు మహీంద్రా థార్ పెట్రోల్ 4డబ్ల్యూడీ వర్షన్లో అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి జిమ్నీ 1.5-లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 103 బీహెచ్పీ విద్యుత్, 134 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో పని చేస్తున్నది. అన్ని వేరియంట్లలో ఈ ఎస్యూవీ 4డబ్ల్యూడీ వర్షన్ స్టాండర్డ్‌గా ఉంటుంది.ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన జిమ్నీ.. జెటా, అల్పా ట్రిమ్స్‌లో లభ్యం అవుతుంది.
మహీంద్రా థార్ 2.0-లీటర్ల ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 150 బీహెచ్పీ విద్యుత్, 320 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో పని చేస్తుంది. థార్ ఆర్డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ ఆప్షన్లలోనూ పని చేస్తుంది.
మారుతి సుజుకి జిమ్నీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ 4డబ్ల్యూడీ ఇంజిన్ లీటర్ పెట్రోల్‌పై 16.94 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఇంజిన్ లీటర్ పెట్రోల్‌పై 16.39 కి.మీ. మైలేజీ అందిస్తుంది. మహీంద్రా థార్ పెట్రోల్ 4డబ్ల్యూడీ వేరియంట్ లీటర్ పెట్రోల్‌పై 13 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
వివిధ ట్రిమ్స్‌లో జిమ్నీ ధరలు ఇలా (ఎక్స్ షోరూమ్)
జెటా మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) – రూ.12.74 లక్షలు
జెటా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఎటీ) – రూ.13.94 లక్షలు
ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) – రూ.13.69 లక్షలు
ఆల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఎటీ) – రూ.14.89 లక్షలు
అల్ఫా మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) డ్యూయల్ టోన్) – రూ.13.85 లక్షలు
అల్ఫా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఎటీ) డ్యుయల్ టోన్) – రూ.15.05 లక్షలు
హైదరాబాద్‌లో వేరియంట్ల వారీగా మహీంద్రా థార్ ధరలు (ఎక్స్ షోరూమ్)
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ ఎంటీ ఆర్డబ్ల్యూడీ – రూ.15.17 లక్షలు
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ పెట్రోల్ ఎటీ ఆర్డబ్ల్యూడీ -రూ.16.94 లక్షలు
థార్ ఏఎక్స్ (ఓ) కన్వర్టిబుల్ టాప్ పెట్రోల్ (ఎంటీ) 4డబ్ల్యూడీ – రూ.17.41 లక్షలు
థార్ ఏఎక్స్ (ఓ) కన్వర్టిబుల్ టాప్ డీజిల్ (ఎంటీ) 4డబ్ల్యూడీ – రూ.18.11 లక్షలు
థార్ ఏఎక్స్ (ఓ) హార్డ్ టాప్ డీజిల్ ఎంటీ 4డబ్ల్యూడీ – రూ.18.17 లక్షలు
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ పెట్రోల్ ఎంటీ 4డబ్ల్యూడీ – రూ.18.26 లక్షలు
థార్ ఎల్ఎక్స్ కన్వర్టిబుల్ టాప్ డీజిల్ ఎంటీ 4డబ్ల్యూడీ – రూ.19.12 లక్షలు
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ ఎంటీ 4 డబ్ల్యూడీ – రూ.19.23 లక్షలు
థార్ ఎల్ఎక్స్ కన్వర్టిబుల్ టాప్ పెట్రోల్ ఏటీ 4 డబ్ల్యూడీ – రూ.20.05 లక్షలు
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ పెట్రోల్ ఏటీ 4డబ్ల్యూడీ – రూ.20.16 లక్షలు
థార్ ఎల్ఎక్స్ కన్వర్టిబుల్ టాప్ డీజిల్ ఏటీ 4డబ్ల్యూడీ – రూ.20.87 లక్షలు
థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ డీజిల్ ఏటీ 4డబ్ల్యూడీ – రూ.20.98 లక్షలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

