Market Capitalisation | టాప్-10 సంస్థల్లో 9 సంస్థలకు లాభాలు.. రూ.1.80 లక్షల కోట్ల లబ్ధి.. టీసీఎస్‌కు భారీ లబ్ధి.. !
Market Capitalisation | గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 ఇండెక్స్ లో టాప్-10 సంస్థల్లో హెచ్ యూఎల్ మినహా అన్ని సంస్థలు రూ.1.80 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,80,788.99 కోట్లు పెరిగింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా లబ్ధి పొందింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ లబ్ధి పొందాయి. మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మాత్రమే నష్టపోయింది.
గతవారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,239.72 పాయింట్లు (1.86 శాతం) లబ్ధి పొందింది. 30-స్టాక్స్ బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం వరుసగా 11వ రోజూ లాభాల్లో కొనసాగింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ 319.63 పాయింట్ల లబ్ధి (0.47 శాతం) పెరిగి 67,838.63 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 408.23 పాయింట్లు (0.60 శాతం) పుంజుకుని 67,927.23 పాయింట్ల ఆల్ టైం గరిష్ట రికార్డు నమోదు చేసింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,300.75 కోట్లు పుంజుకుని రూ. 13,17,203.61 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 28,974.82 కోట్లు పెరిగి రూ.12,58,989.87 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ. 28,354.73 కోట్లు లాభపడి రూ. 5,23,723.56 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,680.53 కోట్ల లబ్ధితో రూ. 6,27,637.87 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,364.55 కోట్ల లాభంతో రూ. 6,94,844.51 కోట్లకు చేరుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.13,342.3 కోట్ల లాభంతో రూ. 5,34,048.78 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.7,442.79 కోట్లు పెరిగి రూ.16,64,377.02 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,232.74 కోట్లు పుంజుకుని రూ.5,59,165.44 కోట్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.5,095.78 కోట్ల లబ్ధితో రూ.4,54,039.37 కోట్ల వద్ద స్థిర పడింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,514.42 కోట్ల నష్టంతో రూ.5,80,325.55 కోట్లతో సరిపెట్టుకున్నది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

