మార్కెట్‌కు ధన్‌తేరాస్ కిక్కిచ్చేనా!
ఈసారి ధన్‌తేరాస్ (ధనత్రయోదశి) అమ్మకాలు బాగుంటాయన్న ఆశాభావం జ్యుయెల్లర్స్లో కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరితో పోల్చితే ప్రస్తుతం ధరలు భారీగా తగ్గడమే ఇందుకు కారణం.
- తగ్గిన ధరలతో జ్యుయెల్లర్స్లో అమ్మకాలు పెరుగుతాయన్న ఆశలు
న్యూఢిల్లీ, నవంబర్ 5: ఈసారి ధన్‌తేరాస్ (ధనత్రయోదశి) అమ్మకాలు బాగుంటాయన్న ఆశాభావం జ్యుయెల్లర్స్లో కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరితో పోల్చితే ప్రస్తుతం ధరలు భారీగా తగ్గడమే ఇందుకు కారణం. దీంతో శుక్రవారం బంగారం, వెండి అమ్మకాల విలువ 20-30 శాతం పెరుగుతుందని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
అయినప్పటికీ వాల్యూమ్ పరంగా బంగారం అమ్మకాలు గత ఏడాది స్థాయిలోనే ఉండే అవకాశం ఉన్నదంటున్నారు. వినియోగదారులు తేలికపాటి నగలు, తక్కువ ధర కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారని వ్యాపారులు చెప్తున్నారు మరి. హిందూ సంప్రదాయంలో బంగారం, వెండి తదితర విలువైన లోహాలు కొనడానికి ధన్‌తేరాస్‌ను అత్యంత శుభదినంగా భావిస్తారన్న విషయం తెలిసిందే.
మళ్లీ పెరిగిన ధరలు
ఢిల్లీలో గురువారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో పన్నులతో కలిపి రూ.1,48,800కు చేరింది. అయితే ఈ ఏడాది జనవరి 29న నమోదైన రికార్డు రూ.1,83,000తో పోలిస్తే ఇది 19 శాతం తక్కువ. అయినప్పటికీ గత ఏడాది అక్టోబర్ 18న ధన్‌తేరాస్ సందర్భంగా నమోదైన రూ.1,32,400 కంటే ప్రస్తుత ధర ఎక్కువగానే ఉన్నది. ఇక కిలో వెండి ధర రూ.1,500 పెరిగి రూ.1,94,500కు చేరింది.
జనవరి 29న మునుపెన్నడూ లేనివిధంగా రూ.4,04,500 పలికిన సంగతి విదితమే. దీంతో 52 శాతం తగ్గింది. కానీ 2025 ధన్‌తేరాస్ నాటి రేటు రూ.1,70,000 కంటే ఇప్పుడు ఎక్కువగానే ఉన్నది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రేటు రూ.1,33,850గా ఉన్నది. బుధవారంతో చూస్తే రూ.2,950 ఎగిసింది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ 65.12 డాలర్లు పెరిగి 4,125.25 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 52.73 డాలర్లకు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇండోనేషియాలో కూలిన నాసా టెలిస్కోప్
మార్కెట్‌కు ధన్‌తేరాస్ కిక్కిచ్చేనా!
బీఎల్ఓలను అడ్డుకుంటే కఠిన చర్యలు
కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక సిటీబ్యూరో: కామన్ పాస్ ధరలపై సర్కార్ టర్న్ తీసుకున్నది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల ఉమ్మడి పాస్ ధరలను సగానికి పైగా తగ్గించనున్నది. ప్రయాణికుల నుంచి ఎదురైన విముఖత, అభ్యర్థనలతో హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరను భారీగా తగ్గించేందుకు సిద్ధమైంది. ధరలు అధికంగా ఉండటం, వినియోగం తక్కువగా ఉండటంతో… ప్రారంభించి నెలరోజులు గడిచినా 100లోపే కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. ఈక్రమంలో ఇరు సంస్థల మధ్య కుదిరిన అభిప్రాయంతో సగానికిపైగా తగ్గించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయి. దీంతోనే కామన్ పాస్‌కు ఆశించిన స్పందన రాలేదు. రోజువారీ పాస్ కోసం రూ. 400, నెలవారీ పాస్ కోం రూ. 8500 చెల్లించాల్సి రావడంతో ప్రజలు దీనికి దూరంగా ఉన్నారు. ఇరు సంస్థల ఒప్పందం మేరకు ధరను ఏకంగా సగానికిపైగా తగ్గించాలని నిర్ణయించారు. కమిటీ చేసిన అధ్యయన నివేదిక ఆధారంగా రోజువారీ పాస్ రూ. 325కి, నెలవారీ పాస్ ధరను రూ. 4000కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
మహాభారతానికి యునెస్కో గుర్తింపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

