Post office Saving Plans | గ్యారంటీ రిటర్న్స్ కావాలా.. ఆ మూడు పోస్టాఫీస్ పథకాలు బెస్ట్!
Post office Saving Plans | గ్యారెంటెడ్ రిటర్న్స్ కోసం మదుపు చేసేవారికి మూడు పోస్టాఫీసు సేవింగ్స్ పథకాలు బెస్ట్ అని చెబుతున్నారు.
Post office Saving Plans | గ్రామీణులకు పోస్టాఫీసు పొదుపు పథకాలు గొప్ప సేవింగ్స్ ఆప్షన్. సేవింగ్స్ స్కీమ్‌ల్లో పెట్టే పెట్టుబడులను స్టాక్ మార్కెట్లకు మళ్లిస్తారన్న భయం లేదు. రిస్క్ అంతకన్నా లేదు.. అంతే కాదు.. మంచి రిటర్న్స్ కూడా ఆఫర్ చేస్తాయి. రిస్క్‌లకు దూరంగా ఉండాలని భావించే వారు పోస్టాఫీసు పొదుపు పథకాల్లో నిధులు మదుపు చేయడమే శ్రేయస్కరంగా కనిపిస్తున్నది. వాటిల్లో మూడు పోస్టాఫీసు పొదుపు పథకాలు ఉన్నాయి. అవి.. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, పోస్టాఫీస్ టైం డిపాజిట్ అకౌంట్ (పీవోటీడీ), పోస్టాఫీస్ – నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ). ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు వాటి విధి విధానాలు, షరతులు, నిబంధనలు, టైం డిపాజిట్ అకౌంట్ మినహా రెండు పథకాలకు ఐదేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటాయి. ఆయా నిబంధనలేమిటో చూద్దామా..!
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (ఆర్డీ)
సురక్షిత, భద్రమైన మదుపు పథకం కోసం ఎదురుచూసే వారికి రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీం నుంచి గుడ్ రిటర్న్స్ ఉంటాయి. అందుకు పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్‌లో చేరిన వారికి ఐదేండ్లలో గ్యారెంటెడ్ రిటర్న్స్ లభిస్తాయి. ఈ పథకంపై 5.8 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నారు. మూడు నెలలకోసారి వడ్డీరేటు సవరిస్తారు. నెలకు కనీసం రూ.100 మదుపు చేయాలి. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు.
పోస్టాఫీస్ టైం డిపాజిట్ అకౌంట్
ఇది ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పథకం. ఈ పథకం కింద ఇన్వెస్టర్లు ఒక ఏడాది, రెండేండ్లు, మూడేండ్లు, ఐదేండ్ల గడువు ప్రకారం డిపాజిట్ చేయొచ్చు. ఒకటి, రెండు, మూడేండ్ల గడువు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5 శాతం, ఐదేండ్ల టైం డిపాజిట్ స్కీంపై రూ.6.7 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఈ పథకం కింద పెట్టుబడులకు ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్ ప్రకారం రాయితీ కూడా ఉంది. కనీసం రూ.1000 మదుపు చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు.
టైం డిపాజిట్ స్కీం వడ్డీరేట్లు ఇలా
ఒక ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ – 5.50 శాతం
రెండేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ – 5.50 శాతం
మూడేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ – 5.50 శాతం
ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ – 6.7 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) పథకానికి ఐదేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీనికి 6.8 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. ఈ పథకం కింద కనీసం రూ.1000 డిపాజిట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తం ఐదేండ్ల తర్వాతే విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో మాత్రం ముందస్తుగా ఈ ఎన్ఎస్సీ కింద డిపాజిట్లను విత్ డ్రా చేసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఈ పథకానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

