న్యూఢిల్లీ, మే 24: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అంచనాలకు మించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.13,191 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,409 కోట్ల లాభంతో పోలిస్తే ఐదు రెట్ల కంటే అధిక వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం మాత్రం రూ. 2,15,487 కోట్ల నుంచి రూ.2,01, 022 కోట్లకు పడిపోయింది.