పర్సనల్ లోన్లపై తక్కువ వడ్డీ
మీకు అత్యవసరంగా డబ్బు అవసరం పడింది. బంగారం, ఇతర ఆస్తులు ఉంటే వీటిని బ్యాంకులో తాకట్టుపెట్టుకొని రుణం తీసుకుంటారు. కానీ ఇవేమి లేవు. ఉన్నది ఒక్కటే ఉద్యోగం. ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వ్యక్తికి బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇది అన్సెక్యూర్డ్ లోన్. ఈ రుణం తీసుకునే వ్యక్తి ఎలాంటి తాకట్టు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు
మీకు అత్యవసరంగా డబ్బు అవసరం పడింది. బంగారం, ఇతర ఆస్తులు ఉంటే వీటిని బ్యాంకులో తాకట్టుపెట్టుకొని రుణం తీసుకుంటారు. కానీ ఇవేమి లేవు. ఉన్నది ఒక్కటే ఉద్యోగం. ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వ్యక్తికి బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇది అన్సెక్యూర్డ్ లోన్. ఈ రుణం తీసుకునే వ్యక్తి ఎలాంటి తాకట్టు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం ఉద్యోగానికి సంబంధించిన నెలవారీ వేతనం సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్‌కు సమర్పించిన వెనువెంటనే రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వ్యక్తిగత రుణాలపై వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి తాకట్టు పత్రాలు లేకుండా ఇస్తున్నారు కనుకనే అధిక వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అయితే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే పర్స్నల్ లోన్ పై వడ్డీ కాస్త తక్కువే ఉంటుంది.
ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీరేటు
పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రుణ గ్రహిత వడ్డీరేటును నిర్ణయించుకునే అవకాశం ఉన్నది. వడ్డీరేటును ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ రేటులో ఏదో ఒకటి ఎంచుకోవచ్చును. ఒకవేళ ఫిక్స్డ్ వడ్డీరేటును ఎంచుకుంటే బ్యాంక్‌లు ఎంసీఎల్ఆర్ను మార్చినప్పటికీ ఈఎంఐ చెల్లింపుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ పర్సనల్ లోన్లు గరిష్ఠంగా ఐదేండ్ల కాలపరిమితితో తీసుకోవచ్చును. ముందస్తుగా చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా ఉన్నది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

