Oracle Layoffs | ఒరాకిల్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్ : హెల్త్ యూనిట్లో కొలువుల కోత
ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో లేఆఫ్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్ మరో దశ లేఆఫ్స్‌కు (Oracle Layoffs) తెగబడుతోంది.
న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో లేఆఫ్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్ మరో దశ లేఆఫ్స్‌కు (Oracle Layoffs) తెగబడుతోంది. ఈసారి హెల్త్ యూనిట్లో కొలువుల కోతకు పాల్పడుతోంది. మరోవైపు ప్రస్తుత జాబ్ ఆఫర్లను సైతం సాఫ్ట్వేర్ దిగ్గజం నిలిపివేస్తోందని, కొన్ని ఓపెన్ పొజిషన్స్ రిక్రూట్మెంట్కు బ్రేక్ వేస్తోందని సమాచారం.
2021 డిసెంబర్లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ కంపెనీ సెర్నెర్ను ఒరాకిల్ కొనుగోలు చేసిన అనంతరం హెల్త్ యూనిట్లో లేఆఫ్స్‌కు సన్నద్ధమైంది. రోగుల ఆరోగ్య సమాచారాన్ని నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టును సెర్నెర్ దక్కించుకోగా, సెర్నెర్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పలువురు రోగులపై ప్రభావం పడటంతో ఈ ఒప్పందం నిలిపివేశారు. ఈ ఒప్పందం నిలిచిపోవడంతో ఒరాకిల్ హెల్త్ డివిజన్లో లేఆఫ్స్‌కు కంపెనీ మొగ్గుచూపినట్టు తెలిసింది.
బాధిత ఉద్యోగులకు ఒరాకిల్ నెల రోజుల వేతనంతో పాటు, ప్రతి ఏడాది సర్వీసుకు గాను అదనంగా ఓ వారం వేతనం, వెకేషన్ డేస్‌కు చెల్లింపులతో కూడిన పరిహార ప్యాకేజ్‌ను ఒరాకిల్ ఆఫర్ చేయనుంది. అమెరికా, ఐరోపా కార్యాలయాల్లో లేఆఫ్స్ ఉంటాయని తెలిసింది. అయితే భారత్‌లోనూ పెద్దసంఖ్యలో ఒరాకిల్ ఉద్యోగులు ఉండగా వీరిలోనూ కొందరిపై వేటు వేస్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు.
Read More :
TCS | రిటన్ టూ ఆఫీస్ పాలసీపై ఉద్యోగుల ఫైర్ : ఉత్పాదకత దెబ్బతింటోందని టెకీల ఆవేదన
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Oracle Layoffs
- USA
- workers
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

