Apple Layoffs | ఆపిల్లో లేఆఫ్స్.. వరుసగా ప్రాజెక్టులు మూసేస్తున్న టెక్ దిగ్గజం..?!
Apple Layoffs | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ఆసియా, ఆమెరికాల్లోని యూనిట్లలో ఉద్యోగులను సాగనంపుతున్నదని సమాచారం.
Apple Layoffs | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. ఐ-ఫోన్లు అన్నా.. ఆపిల్ వాచ్లు అన్నా.. అందరూ ఎగిరి గంతేస్తారు. ఎంతో విలువైన ఆపిల్ కంపెనీలో ఉద్యోగం అంటే ఇక వేరే చెప్పాలా.. కానీ, ఆపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను కుదిస్తోందని వార్తలొచ్చాయి. ఐ-ఫోన్ తయారీ సంస్థ ఆపిల్.. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులకు లే-ఆఫ్ ఇవ్వనున్నదని తెలుస్తున్నది.కొంత కాలం క్రితం ‘సెల్ఫ్ డ్రైవింగ్ కారు’ ప్రాజెక్టును మూసేసింది. ఇప్పుడు తమ స్మార్ట్ వాచ్ డిస్ ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును మూసేస్తున్నది.
కొంత కాలం క్రితం మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్ల తయారీని నిలిపేసింది. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్లు, విజువల్స్ ఎంతో మెరుగ్గా ఉండటంతో అందరూ ‘ఆపిల్ వాచ్’ కొనుక్కునే వారు. అయితే, డిస్ ప్లే తయారీ ఖర్చు ఎక్కువ కావడంతో ఆపిల్ తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేస్తున్నదని సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా, ఆసియా ఖండాల్లోని ఆపిల్ యూనిట్లలో డజన్ల కొద్దీ పోస్టులను తొలగిస్తున్నది. దీంతో ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారన్న సంగతి ఆపిల్ వెల్లడించలేదు.
ఉద్యోగులు పని చేస్తున్న ప్రాజెక్టులను మూసేయడానికి ముందు వారు ఇతర ప్రాజెక్టుల్లో తమకు వీలైన ఉద్యోగం వెతుక్కునేందుకు అనుమతి ఇస్తుంది. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. కనుక మిగతా వారిని ఇంటికి సాగనంపేందుకు ఆపిల్ చర్యలు తీసుకుంటున్నదని బ్లూంబర్గ్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

