Lava Yuva 5G | లావా నుంచి మరో ఎంట్రీ లెవల్ ఫోన్ లావా యువ 5జీ.. ఆవిష్కరణ ఎప్పుడంటే..?!
Lava Yuva 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ భారత్ మార్కెట్లో తన లావా యువ 5జీ ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.
Lava Yuva 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ భారత్ మార్కెట్లో తన లావా యువ 5జీ ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం లావా ఇంటర్నేషనల్ తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ హ్యాండిల్ వేదికగా ఈ నెల 30 మధ్యాహ్నం 12 గంటలకు లావా యువ 5జీ ఫోన్ ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా ఫోన్ విక్రయాలు జరుగుతాయని ధృవీకరించింది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ కెమెరా సెటప్, మ్యాట్టె ఫినిష్ తో గ్లాస్ బాక్, సర్క్యులర్ షేప్డ్ కమెరా మాడ్యూల్, హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్, ఫ్లాట్ ఫ్రేమ్ విత్ రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. గరిష్టంగా 2.4 గిగా హెర్ట్జ్ స్పీడ్‌తో ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ విత్ టూ కోర్స్, 2.0 గిగా హెర్ట్జ్ క్లాకింగ్ 6 కోర్స్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 16-మెగా పిక్సెల్ సెన్సర్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటాయని తెలుస్తున్నది. దీని ధర రూ.10 వేల లోపే ఉంటుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

