Lava O2 | లావా నుంచి మరో ఎంట్రీ లెవల్ ఫోన్ లావా ఓ2.. ఇవీ స్పెషికేషన్స్..
Lava O2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ .. మరో ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లావా ఓ2 ఫోన్ ను ఆవిష్కరించింది.
Lava O2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International).. మరో ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లావా ఓ2 (Lava O2) ఫోన్ ను ఆవిష్కరించింది. యూనిసోక్ టీ616 ఎస్వోసీ విత్ 8జీబీ ర్యామ్ తో వచ్చింది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 50-మెగా పిక్సెల్ సెన్సర్ తో కూడిన డ్యుయల్ కెమెరా యూనిట్, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉన్నాయి.
లావా ఓ2 (Lava O2) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499లకే లభిస్తుంది. ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద రూ.500 డిస్కౌంట్ అందిస్తున్నది. ఇంపీరియల్ గ్రీన్, మేజిస్టిక్ పర్పుల్, రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది ఫోన్ ఈ నెల 27 నుంచి అమెజాన్, లావా ఈ-స్టోర్ ద్వారా విక్రయాలు ప్రారంభం అవుతాయి.
లావా ఓ2 ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ పై పని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో 6.5 అంగుళాల హెచ్డీ+ (720×1600 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్ లో వర్చువల్ గా మరో 8జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా యూనిట్ ఉంటుంది. స్క్రీన్ ఫ్లాష్ తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
లావా ఓ2 (Lava O2) ఫోన్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ మాత్రమే కలిగి ఉన్నా, మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 512 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, జీఆర్పీఎస్, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఫోన్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, ఆంబియెంట్ లైట్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి. 18 వాట్ల చార్జింగ్ మద్దతుతో లావా ఓ2 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సింగిల్ చార్జింగ్ తో 38 గంటల టాక్ టైం, 500 గంటల వరకూ స్టాండ్ బైగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

