Lava Blaze Pro 5G | చౌక ధరకే లావా బ్లేజ్ ప్రో 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్.. !
Lava Blaze Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. దేశీయ మార్కెట్లోకి తక్కువ ధరకే లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే ఇంటికొచ్చి మరీ మరమ్మతు చేస్తారు.
Lava Blaze Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) మంగళవారం దేశీయ మార్కెట్లో లావా బ్లేజ్ ప్రో 5జీ (Lava Blaze Pro 5G) ఆవిష్కరించింది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్సెట్తో వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది.
లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.12,499లకు లభిస్తుంది. రేడియంట్ పెరల్, స్టారీ నైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా వెబ్ సైట్లలో అక్టోబర్ మూడో తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 396పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2460 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. సెల్ఫీ షూటర్ కోసం స్క్రీన్‌పై హోల్ పంచ్ కటౌట్ ఉంటుంది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 8జీబీ ర్యామ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. వర్చువల్ గా 16 జీబీ ర్యామ్ వరకూ పొడిగించుకోవచ్చు.
లావా బ్లేజ్ ప్రో 5జీ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్ మద్దతుతో 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు.
5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎం రేడియో, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/ జీ /ఎన్/ ఏసీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. యాక్సిలో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, గైరోస్కోప్, మాగ్నటో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి. అథంటికేషన్ కోసం ఫేస్ అన్ లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

