Lava Blaze 2 5G | లావా నుంచి మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ .. ఇవీ డిటైల్స్..!
Lava Blaze 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా (Lava International) మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ (Lava Blaze2 5G) మార్కెట్లో ఆవిష్కరించింది.
Lava Blaze 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా (Lava International) మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ (Lava Blaze2 5G) మార్కెట్లో ఆవిష్కరించింది. గ్లాస్ బ్యాక్‌తోపాటు మూడు కలర్స్‌లో లభిస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల 2.5 డీ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. లావా బ్లేజ్2 5జీ (Lava Blaze2 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్సెట్ (Media Tek Dimensity 6020 SOC) తో వస్తోంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నదీ లావా బ్లేజ్2 5జీ ఫోన్ (Lava Blaze 2 5G).
లావా బ్లేజ్2 5జీ (Lava Blaze 2 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు లభిస్తుంది. గ్లాక్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా వేదికలపై సేల్స్ ప్రారంభం అవుతాయి.
లావా బ్లేజ్2 5జీ (Lava Blaze 2 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్ తోపాటు రెండేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 6.56 -అంగుళాల హెచ్డీ+ (720×1600 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్.. సెల్ఫీ షూటర్ కోసం హోల్ పంచ్ కటౌట్‌తోపాటు 2.5 డీ కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఓక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్నదీ ఫోన్. 6జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్లో వర్చువల్‌గా మరో 6జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.
ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తోంది లావా బ్లేజ్2 5జీ ఫోన్. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్‌తో 8-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించవచ్చు.
లావా బ్లేజ్2 5జీ ఫోన్ 5జీ, 4జీ, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, మాగ్నెటో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ తదితర సెన్సర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ లావా బ్లేజ్2 5జీ ఫోన్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

