Apple VS Google | గూగుల్‌తో ఢీ : సొంత సెర్చ్ ఇంజన్ ఏర్పాటుకు యాపిల్ సన్నాహాలు
తాము కాలుమోపిన రంగాల్లో దిగ్గజ శక్తులుగా ఎదిగిన యాపిల్, గూగుల్ ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తున్నాయి. సెర్చ్ ఇంజన్ మార్కెట్ లీడర్‌గా గూగుల్ ఏకచత్రాధిపత్యం కొనసాగుతుండగా ఈ స్పేస్‌లో అడుగుపెట్టి సెర్చ్ ఇంజన్ దిగ్గజాన్ని ఢీ కొట్టాలని యాపిల్ యోచిస్తోంది.
న్యూయార్క్ : తాము కాలుమోపిన రంగాల్లో దిగ్గజ శక్తులుగా ఎదిగిన యాపిల్, గూగుల్ ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తున్నాయి. సెర్చ్ ఇంజన్ మార్కెట్ లీడర్‌గా గూగుల్ ఏకచత్రాధిపత్యం కొనసాగుతుండగా ఈ స్పేస్‌లో అడుగుపెట్టి సెర్చ్ ఇంజన్ దిగ్గజాన్ని ఢీ కొట్టాలని యాపిల్ యోచిస్తోంది. సొంత సెర్చి ఇంజన్‌ను లాంఛ్ చేసేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేపట్టింది.
2023 జనవరి నాటికి సెర్చ్ ఇంజన్ పనిచేసేలా యాపిల్ ప్రణాళికలు రూపొందిస్తోందని వార్తలు వస్తున్నాయి. గూగుల్‌తో నేరుగా ఢీకొనేలా యాపిల్ సొంతంగా సెర్చ్ ఇంజన్‌తో ముందుకొస్తుందని టెక్ బ్లాగర్ రాబర్ట్ సోబల్ అంచనా వేశారు. యాపిల్ సొంత సెర్చ్ ఇంజన్‌ను డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపిన మీదట తాను ఈ సమాచారాన్ని ట్విట్టర్లో పంచుకుంటున్నానని టెక్ రాడార్‌తో మాట్లాడుతూ సోబల్ చెప్పుకొచ్చారు. యాపిల్ సొంత సెర్చ్ ఇంజన్‌పై వచ్చే ఏడాది జనవరిలో అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఇక యాపిల్ లేటెస్ట్ ఐఓఎస్ 16, ఐపాడ్ ఓఎస్16, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ 13ను లాంఛ్ చేయనుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే (ఏఓడీ) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో లాంఛ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్‌లో ఏఓడీ ఫీచర్‌ను యాపిల్ ప్రవేశపెట్టనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Apple
- search engine
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

