పాన్-ఆధార్ అనుసంధానం.. మళ్లీ గడువు పొడిగించిన కేంద్రం !
పాన్-ఆధార్ అనుసంధానం.. కేంద్రం మళ్లీ గడువు పొడిగింపు!| ఆధార్- పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించిం

న్యూఢిల్లీ: ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన ఆధార్- పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవచ్చు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ గడువును మరో దఫా పొడిగించింది.
అలాగే సొంతింటిపై పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపును మూడు నెలలకు పైగా పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. అలాగే వివాద్ సే విశ్వాస్ చెల్లింపుల పథకాన్ని రెండు నెలలు పొడిగించింది.
కరోనా చికిత్స పొందిన వారికి, మరణించిన వారికి పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఒక ఉద్యోగికి యాజమాన్యం చెల్లించిన కొవిడ్ వైద్య చికిత్స మొత్తంపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- aadhar card
- link
- pan card
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

