Aadhar Update | ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?
Aadhar Update | పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటి ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉడాయ్ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
Aadhar Update | నేటి సమాజంలో ఆధార్ కార్డు (aadhaar card) వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటికి అధార్ తప్పనిసరి అయ్యింది. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. దీంతోపాటు ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆధార్‌లో మార్పులు, చేర్పులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తున్నది.
ఈ క్రమంలోనే పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటి ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉడాయ్ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది. ఈసారి ఏకంగా ఆరు నెలలు గడువు పెంచింది. 2025 జూన్ 14 వరకు గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉడాయ్ అధికార వెబ్సైట్ http://myaadhar.uidai.gov.inలో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు.
ఆన్లైన్లో అప్డేట్ చేసుకోండిలా..
https:// myaadhaar.uidai.gov.in పోర్టల్‌లో ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన అనంతరం డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే స్క్రీన్‌పై వివరాలు వస్తాయి. వాటిని పూర్తిగా పరిశీలించి సవరణ ఉంటే చేయాలి. లేదంటే ఉన్న వివరాలతోనే నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోలింగ్ చేస్తే వచ్చే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే అప్డేట్ పూర్తయినట్లు పోన్ నెంబర్‌కు పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక గడువు ముగిసిన అనంతరం అప్డేట్తో పాటు ఫొటో, నివాసం, ఇతర మార్పులు, చేర్పులు చేసుకునేందుకు విధిగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read..
Gold Rates | దిగొచ్చిన బంగారం.. తులంపై రూ.1,400 తగ్గిన ధర
వాహన ధరలు పెంచిన అశోక్ లేలాండ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

