బంపర్ బొనాంజా : హోంలోన్ వడ్డీరేటు 6.50 శాతానికి తగ్గించిన కొటక్ మహీంద్ర బ్యాంక్!

న్యూఢిల్లీ : సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి కొటక్ మహీంద్ర బ్యాంక్ తీపికబురు అందించింది. ఇండ్ల కొనుగోలుదారులకు బ్యాంకు పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే రెండు నెలల వరకూ కొటక్ మహీంద్ర బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రికార్డు స్ధాయిలో కేవలం 6.50 శాతానికే హోం లోన్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ వ్యవధి సెప్టెంబర్ 10 నుంచి నవంబర్ 8 వరకూ ఉంటుందని బ్యాంక్ పేర్కొంది.
పండుగ వేళ లక్షలాది గృహ కొనుగోలుదారుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ ఆఫర్‌ను ముందుకు తెచ్చామని, కొటక్ బ్యాంక్ అందిస్తున్న 6.50 శాతం హోమ్ లోన్ వడ్డీ రేటుతో ప్రజలకు సొంతిల్లు సమకూరడం మరింత సులభతరమవుతుందని బ్యాంక్ కన్జూమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుజ్ చంద్నా పేర్కొన్నారు. కొటక్ బ్యాంక్స్ డిజి హోమ్ లోన్స్ గృహ రుణం దరఖాస్తుదారులు ఆన్లైన్లో అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తుందని బ్యాంక్ వెల్లడించింది.
ఆన్లైన్లోనే దరఖాస్తుదారులకు సూత్రప్రాయ రుణ మంజూరు పత్రం, వారి గృహ రుణం మొత్తం అర్హత, రుణ వ్యవధి, వడ్డీరేటు, ఈఎంఐ వంటి అన్ని వివరాలూ పంపుతామని పేర్కొంది. పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ విధానంతో గృహ రుణాల మంజూరు ప్రక్రియ చేపట్టామని కొటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

