Kia-Hyundai | హ్యుందాయ్, కియా షాకింగ్ నిర్ణయం..! 34లక్షల కార్లు రీకాల్..! కారణాలు ఏంటంటే..?
Kia-Hyundai | ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు హ్యుందాయ్, కియా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు 34లక్షల వరకు కార్లను రీకాల్ చేశాయి. పలు మోడల్స్‌కు చెందిన కార్లలో కంపెనీలు లోపాలను గుర్తించాయి. ఈ మేరకు వాటిని రీకాల్ చేసి మరమ్మతులు చేయించుకోవాలని సూచించింది.
Kia-Hyundai | ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు హ్యుందాయ్, కియా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు 34లక్షల వరకు కార్లను రీకాల్ చేశాయి. పలు మోడల్స్‌కు చెందిన కార్లలో కంపెనీలు లోపాలను గుర్తించాయి. ఈ మేరకు వాటిని రీకాల్ చేసి మరమ్మతులు చేయించుకోవాలని సూచించింది. అయితే, దాదాపు 34లక్షల వరకు అమెరికాలోనే రెండు కంపెనీలు కార్లను రీకాల్ చేశాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆయా కంపెనీలు వినియోగదారులకు సైతం కీలక సూచనలు చేశాయి. మరమ్మతులు చేసే వరకు ఆయా మోడల్స్ కార్లను ఇంటికి దగ్గరల్లో పార్క్ చేయకూడదని, జనావాసాలకు దూరంగా ఉంచాలని సూచించారు. అంతర్గత బ్రేక్ ఫ్లూయిడ్ లీకేజీల కారణంగా ఎలక్ట్రికల్ షార్ట్ ఏర్పడి మంటలు చెలరేగే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో ‘ది నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్’ (NHTSA) సైతం కీలక ప్రకటన చేసింది. కంపెనీల సూచనలు పాటించాలని సూచించింది. హుంద్యాయ్ కార్లకు సంబంధించి 21 అగ్ని ప్రమాద ఘటనలు జరిగినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. పది కియా కార్లలో పేలుడు ఘటనలు జరిగాయని, మరో పది ఇతర కారణాలతో డ్యామేజీ జరిగినట్లు పేర్కొంది. కియా అమెరికా దాదాపు 17.3 లక్షల కార్లను రీకాల్ చేసింది.
ఇందులో బొరెగో, కాడెంజా, ఫోర్టే, స్పార్టేజ్, కే900, ఆప్టిమా, సోల్ రియో, సొరెంటో, రోండో తదితర మోడల్స్ ఉన్నాయి. 2010 నుంచి 2018 మధ్య ఉత్పత్తయ్యాయి. హ్యుందాయ్ 16.4లక్షల కార్లను రీకాల్ చేయగా.. ఇందులో ఎలంట్రా, జెనెసిస్ కూపే, సొనాటా హైబ్రిడ్, అసెంట్, అజెరా, వెలోస్టర్, సాంటా ఫే, ఎకస్, వెరాక్రజ్, టక్సన్, టక్సన్ ఫ్యూయెల్ సెల్, సాంటా ఫే స్పో్ర్ట్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఇవి 2011 -2015 మధ్య తయారయ్యాయని నివేదిక పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- America
- hyundai
- kia car
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

