Kia Carens | కియా కరెన్స్‌లో అట్రాక్టివ్ ఫీచర్లివే.. 14 నుంచి బుకింగ్స్ షురూ!
Kia Carens | కియా కరెన్స్ కారు బుకింగ్స్ ఈ నెల 14 నుంచి మొదలవుతాయి. గత మోడల్స్‌తో పోలిస్తే ఆకర్షణీయ ఫీచర్లతో వస్తోంది.

Kia Carens | దక్షిణకొరియా ఆటోమొబైల్ మేజర్ కియా మోటార్స్ ఇటీవల భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త కరెన్స్ మోడల్ కారు కోసం బుకింగ్స్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది రిక్రియేషనల్ వెహికల్ (ఆర్వీ) అని కియా అభివర్ణించింది. భారత్ మార్కెట్లో కియా ఆవిష్కరించిన నాలుగో మోడల్ కారు.. కరెన్స్. ఈ కారులో లభించే ఫీచర్లను వెల్లడించింది. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో లభిస్తుంది. లగ్జరీ ప్లస్ వేరియంట్లలో ఆరు లేదా ఏడు సీట్లు ఉంటాయి. మిగతా అన్ని మోడల్ కార్లలో ఏడు సీట్లు ఏర్పాటు చేసింది.డీజిల్, పెట్రోల్ వినియోగ ఇంజిన్లతో వస్తోంది. 1.5 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లతో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ చాయిస్ గేర్బేక్ వస్తుంది. 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ మాత్రం 1.4 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే పొందొచ్చు
కియా కరెన్స్ ఎనిమిది రంగుల్లో కస్టమర్ల ముంగిట్లోకి వస్తున్నది. మోస్ బ్రౌన్, స్పార్ల్సింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, అరోరా బ్లాక్ పర్ల్, గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్ పర్ల్, క్రియర్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. ఇక సెల్టోస్, సొనెట్, కార్నివాల్‌తో పోలిస్తే కరెన్ భిన్నంగా ఉంటుంది. పెద్ద ఎస్యూవీ మోడల్లో దీన్ని రూపొందించింది. కియా సొంతమైన టైగర్ నోస్ గ్రిల్ డిజైన్ ఇందులో చేర్చారు. కొత్తగా రేడియేటర్ గ్రిల్‌తోపాటు చివర్లో సన్నటి ఎల్ఈడీ లైట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. క్రోమ్ గార్నిష్డ్ డోర్ హ్యాండిల్స్, ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్ వింగ్ మిర్రర్, స్పోర్టీ అలాయ్ వీల్స్, చంకీ బ్లాక్ బంపర్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
కియా కరెన్స్ ఎంట్రీ లెవల్ కారు ధర సుమారు రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతుందని అంచనా. వచ్చేనెలలో కరెన్స్ కారు ధర వరల వివరాలను కియా మోటార్స్ ప్రకటించే అవకాశం ఉంది. 10.25 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఎనిమిది స్పీకర్లతో బోస్ సౌండ్ సిస్టం, స్మార్ట్ ఎయిర్ ఫ్యూరిఫయ్యర్, వైరస్, బ్యాక్టీరియా ప్రొటెక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్కైలైట్ సన్‌రూఫ్, ప్రీమియం లెదర్ సీట్లతో కరెన్స్ క్యాబిన్ అందంగా కస్టమర్లను ఆకర్షిస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

