న్యూఢిల్లీ, ఆగస్టు 20: గత కొన్ని నెలలుగా నిస్తేజంగా కొనసాగిన కీలక రంగాలు మళ్లీ వృద్ధి బాటపట్టాయి. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, విద్యుత్, ఖనిజ విభాగాలు మెరుగైన పనితీరు కనబర్చడంతో గత నెలకుగాను తొమ్మిది కీలక రంగాలు 5.4 శాతం వృద్ధిని సాధించాయి. కానీ, జూన్ నెలలో నమోదైన 6 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 3 శాతంతో పోలిస్తే భారీగా పెరిగింది.
గతంలో ఎనిమిదిగా ఉన్న కీలక రంగాలు ఇటీవల కొత్తగా ఇనుప ఖనిజం జతపరిచింది. అలాగే క్రూడాయిల్, సహజ వాయువు, ఎరువులు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఏప్రిల్-జూలై నెలకుగాను కీలక రంగాలు 4.3 శాతం వృద్ధిని కనబరిచాయి.