ఆర్థిక సేవల్లో ఏఐ దూకుడు
- కృత్రిమ మేధతో బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు
- ఇప్పటికే 70 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల్లో ఏఐ

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘మరో రెండు రోజుల్లో మీ ప్యాక్ గడువు ముగుస్తుంది. వెంటనే రీచార్జ్ చేయండి’ అని మొబైల్‌కు అలర్ట్ మెసేజ్‌లు వస్తుంటాయి. ఇదొక్కటే కాదు బ్యాంకింగ్ యాప్‌లు, పేమెంట్ వ్యాలెట్లలో గత ఏడాది కాలంలో కొత్త కొత్త ఆప్షన్లు కనిపించడం, సేవల విస్తృతి పెరుగడం వంటివి గమనించే ఉంటాం. ఇవన్నీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో (ఏఐ) కలుగుతున్న ప్రయోజనాలే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లేదా కృత్రిమ మేధ.. అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న అత్యాధునిక టెక్నాలజీ. ఉత్పత్తిని పెంచడంలో, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో, జీవన ప్రమాణాలను పెంచడంలో కృత్రిమ మేధ (ఏఐ) ముఖ్యపాత్ర పోషిస్తున్నది. ఈ టెక్నాలజీ ఇప్పుడు ఆర్థిక సేవల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. డెలాయిట్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 70 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్‌ను ఆశ్రయిస్తున్నాయి. దేశ జీడీపీలో ఏఐ వాటా 2.5 శాతానికి పెరుగుతుందని అసోచామ్ చెప్పగా, ఈ రంగం ఈ ఏడాది 17.4 శాతం వృద్ధి సాధిస్తుందని ఐడీసీ అంచనా వేసింది.
- లాక్డౌన్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్బీఐ-2020 నివేదిక ప్రకారం గతేడాది ఆర్థిక మోసాల కేసులు ఏకంగా 234 శాతం పెరిగాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల్లో ఫ్రాడ్ కేసులు 500 శాతం పెరిగాయి. ఈ-కామర్స్ కొనుగోళ్లలోనూ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ వీటిని అరికట్టవచ్చన్నది నిపుణుల మాట. ఇది వినియోగదారుల వ్యవహారశైలిని, లొకేషన్‌ను, కొనుగోలు అలవాట్లను అంచనా వేస్తుంది. కొనుగోళ్లలో విపరీతమైన వ్యత్యాసం కనిపిస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకుల్లో అనుమానిత లావాదేవీలను గుర్తించవచ్చని, బ్యాంకుల వ్యవస్థాగత లోపాలను గుర్తించి మోసాలను అరికట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు.
- యాంటీ మనీలాండరింగ్లోనూ ఏఐని వాడుతున్నారు. అనుమానిత లావాదేవీలను గుర్తించి హెచ్చరించడంతోపాటు డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నదో, ఎక్కడికి వెళ్తున్నదో సమాచారం ఇస్తుంది.
- వినియోగదారుల ఆదాయ, వ్యయాలను విశ్లేషిస్తుంది. ఆహారం, ఆరోగ్యం, దుస్తులు, ప్రయాణం, విలాసాలు.. ఇలా ఏ రంగంలో ఎంత ఖర్చు పెడుతున్నారో నివేదికలు రూపొందిస్తున్నది. అవసరానికి మించి ఖర్చు పెడితే హెచ్చరికలు జారీ చేయడంతోపాటు వినియోగదారుల విన్నపాన్ని బట్టి డబ్బును ఏలా ఆదా చేయాలో సూచనలు ఇస్తుంది.
- సంప్రదాయ క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థతో పోల్చితే ఏఐ మరింత ఖచ్చితత్వంతో క్రెడిట్ హిస్టరీని పరిశీలించి నివేదికలు ఇస్తుంది. తద్వారా సమర్థులకే లోన్లు మంజూరు చేసేలా బ్యాంకులకు ప్రయోజనం కలుగుతుంది.
- డబ్బును పొదుపు చేయడానికి, పెట్టుబడిగా పెట్టడానికి అనేక కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటినీ ఫిన్‌టెక్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా ఒకే గొడుగు కిందికి తెచ్చి.. వినియోగదారులు డిజిటల్ స్క్రీన్‌పై ఒకే ట్యాప్‌తో సేవలను పొందేలా చేయవచ్చు. బ్యాంకు ఖాతాలను అనుసంధానించడం ద్వారా లావాదేవీలు సైతం నిర్వహించవచ్చు.
- ఏఐతో స్మార్ట్ బ్యాంకింగ్, వాయిస్ కంట్రోల్డ్ వర్చువల్ అసిస్టెన్స్ సేవలు వంటివి అందుబాటులోకి వస్తాయి. తద్వారా వినియోగదారులకు ఏదైనా సమస్య తలెత్తితే సులభంగా పరిష్కార మార్గం దొరుకుతుంది.
- అప్లికేషన్ ప్రాసెసింగ్‌కు ఏఐని అనుసంధానించడం ద్వారా వందల మందికి పనిభారం తగ్గడంతోపాటు వేలాది పనిగంటలు కలిసివస్తున్నాయి.
- చివరగా ఫైనాన్షియల్ సేవల సంస్థలు నిబంధనలన్నీ కచ్చితంగా పాటించేలా పర్యవేక్షిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

