Kawasaki | జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘కవాసకి’ ఇయర్ ఎండ్ సందర్భంగా వివిధ శ్రేణుల మోటారు సైకిళ్లపై ఆఫర్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.60 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్లు డిసెంబర్ నెలాఖరు వరకూ వర్తిస్తాయి. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..!
మిడిల్ వెయిట్ క్రూయిజర్ ‘వుల్కాన్ ఎస్’ మోటారు సైకిల్ మీద రూ.60 వేల రాయితీ పొందొచ్చు. ఈ బైక్ ధర రూ.7.10 లక్షలు (ఎక్స్ షోరూమ్).
కవాసకి స్పోర్ట్స్ బైక్ నింజా400 మీద రూ.35 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.5,23,985.
మరో బైక్ ‘కవాసకి నింజా 650’ మీద రూ.30 వేల విలువైన రాయితీ అందిస్తోంది. ఈ మోటారు సైకిల్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.7.16 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
వెర్సీ650 అడ్వెంచర్ మోటారు సైకిల్ మీద రూ.20 వేల వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ మోటారు సైకిల్ ధర రూ.6.69 లక్షల నుంచి రూ.7.15 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
కవాసకి మోటారు సైకిళ్లతోపాటు హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్ సంస్థలు సైతం తమ మోటారు సైకిళ్లపై రాయితీలు అందిస్తున్నాయి.