Twitter-Musk | ట్విట్టర్ టేకోవర్ డీల్‌ను రద్దు చేస్తూ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ తీసుకున్న నిర్ణయంపై అక్టోబర్‌లో విచారణ చేపట్టాలని డెలావేర్ జడ్జి ప్రకటించారు. ఫిబ్రవరి వరకు విచారణ వాయిదా వేయాలని ఎలన్‌మస్క్ కోరుతుండగా, ట్విట్టర్ మాత్రం సెప్టెంబర్‌లో విచారించాలని వాదించింది. 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని గత ఏప్రిల్‌లో ఎలన్‌మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదముద్ర వేసింది.
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంపై అనిశ్చితి కొనసాగించడం వల్ల సంస్థకు ప్రతి రోజూ ప్రతి గంట హాని జరుగుతుందని ఆ సంస్థ తరపు న్యాయవాది విలియం సావిట్ వాదించారు. సోమవారం జడ్జి, చాన్సలర్ కేథలీన్ మైక్ కార్మిక్కు కరోనా సోకడంతో వర్చువల్‌గా విచారణ చేపట్టారు.
ట్విట్టర్లో స్పామ్ ఖాతాలు ఉన్నాయన్న సాకుతో కొనుగోలు డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎలన్‌మస్క్ ఇటీవల ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. డీల్ నుంచి తప్పుకుంటే ఎలన్‌మస్క్.. ట్విట్టర్‌కు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.