హైదరాబాద్‌లో జేపీ మోర్గాన్ భారీ క్యాంపస్
- ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌లో
- ఆసియా-పసిఫిక్ దేశాల్లో సంస్థకు ఇదే అతిపెద్దది
- పూర్తిగా డిజిటలైజేషన్, పేపర్‌లెస్ వర్క్
- 8.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం
భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది. హైదరాబాద్‌లో ఇంకో ప్రపంచ శ్రేణి క్యాంపస్ ఏర్పాటైంది. అమెరికా బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్ హైటెక్ సిటీలో ఈ కొత్త క్యాంపస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న జేపీ మోర్గాన్.. తమ ప్రధాన కేంద్రాల్లో హైదరాబాద్‌ను కూడా చేర్చుకున్నట్టయింది. ఆసియా-పసిఫిక్‌లో సంస్థకు ఇదే అతిపెద్ద క్యాంపస్ కావడం గమనార్హం. అత్యాధునిక హంగులతో పర్యావరణహితంగా 8.22 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో ఉద్యోగుల ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం చార్జింగ్ పాయింట్లనూ పెట్టడం విశేషం. ఈ క్యాంపస్‌ను పూర్తిగా డిజిటలైజేషన్ చేయగా, ఉద్యోగుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేసినట్టు సంస్థ వెల్లడించింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది. అమెరికాకు చెందిన బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్.. హైదరాబాద్‌లో తమ నూతన క్యాంపస్‌ను ప్రారంభించింది. హైటెక్ సిటీ వద్దగల సలార్పురియా సత్వా నాలెడ్జ్ సిటీలో దీన్ని సంస్థ ఏర్పాటు చేసింది. కొత్త, వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా తెచ్చిన ఈ క్యాంపస్.. తమ ఉద్యోగులకు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని, అత్యుత్తమ-సాంకేతిక విలువలతో కూడిన పనిని నేర్పించగలదని ఈ సందర్భంగా సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సేవల ఏకీకరణను ఈ క్యాంపస్ మరింత సులువు చేస్తుందని.. టెక్నాలజీ, రిస్క్, ఆపరేషన్స్, సపోర్ట్ సర్వీసెస్‌లలో ఇక్కడి ఉద్యోగులు పనిచేస్తారని సోమవారం జేపీ మోర్గాన్ ఇండియా, ఫిలిప్పీన్స్ కార్పొరేట్ సెంటర్ల సీఈ వో దీపక్ మంగ్లా తెలిపారు.
రత్‌లో మా సంస్థకు హైదరాబాదే ప్రధాన ఆర్థిక, సాంకేతిక కేంద్రం. సంస్థ వృద్ధిలోనూ నగరానిది కీలకపాత్రే. మా పెట్టుబడుల నిబద్ధతకు ఈ క్యాంపస్ నిదర్శనం. క్లయింట్లతో మమేకం కావడానికీ ఇదో చక్కని వేదిక. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు ప్రపంచ స్థాయి అనుభవం లభిస్తుంది. హైదరాబాద్‌లోని ప్రతిభావంతులు, నైపుణ్యంగలవారికి ఇదో చక్కని అవకాశం. -డానియల్ విల్కెనింగ్, జేపీ మోర్గాన్ అంతర్జాతీయ సేవల అధిపతి
8.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం
ప్రపంచవ్యాప్తంగా జేపీ మోర్గాన్కున్న ప్రధాన క్యాంపస్‌లలో ఇది ఒకటి
ఆసియా-పసిఫిక్ దేశాల్లో సంస్థకు ఇదే అతిపెద్ద క్యాంపస్
అందుబాటులో వెల్నెస్, రిలాక్సేషన్ జోన్లు, మెడికల్ సెంటర్
విద్యుత్తు ఆధారిత వాహనాల కోసం చార్జింగ్ పాయింట్లు
ఇన్నోవేషన్ ల్యాబ్, టెక్ బార్, శిక్షణ, సమావేశ మందిరాలు
ఉద్యోగుల కోసం ప్రతీ అంతస్తులో కేఫ్‌లు, లైబ్రరీ
పూర్తి డిజిటలైజేషన్, పేపర్‌లెస్ వర్క్పర్యావరణ హిత, ఇంధన పొదుపు వ్యవస్థ

హైదరాబాద్‌లో జేపీ మోర్గాన్ కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరం.
-కే తారక రామారావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

