Job cuts | బోయింగ్ షాకింగ్ డెసిషన్.. త్వరలో 17 వేల మంది ఉద్యోగులపై వేటు
Job cuts | ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే సుమారు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు.
Job cuts : ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే సుమారు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దాంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన 777 ఎక్స్ విమానాలను ఆ తర్వాత ఏడాదికి అంటే 2026కు వాయిదా వేసింది. ఇప్పటికే ఉన్న ఆర్డర్లు పూర్తయిన తర్వాత 2027 నుంచి 767 ఫైటర్ విమానాల ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఇక ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లు 1.7 శాతం పతనమయ్యాయి. కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో సంస్థ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

