న్యూఢిల్లీ, డిసెంబర్ 15: జియోటీవీ ప్రీమియం ఖాతాదారుల కోసం రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. రకరకాల బండిల్స్‌తో రూ.398, రూ.1,198, రూ.4,498 ధరల్లో వీటిని తీసుకొచ్చింది. శుక్రవారం నుంచే సబ్స్ర్కైబర్స్కు అందుబాటులోకి వచ్చాయి. కాగా, ఈసారి ప్రప్రథమంగా జియోటీవీ ప్రీమియం వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇప్పటిదాకా ఇది ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్లతో ఉచిత యాడ్-ఆన్గానే లభిస్తుండటం గమనార్హం.
సింగిల్ లాగిన్‌తో..
సింగిల్ లాగిన్తోనే 14 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో అనుమతి వస్తున్నది. ఈ ఓటీటీల్లో జియోసినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ప్రైమ్ వీడియా (మొబైల్), లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, డుకుబే, హాయ్చాయ్, సన్నెక్స్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఎపిక్ఆన్, కంచా లంకా ఉన్నాయి. తాము ఎంచుకున్న ప్లాన్‌తో అనుసంధానమైన తమ మొబైల్ నెంబర్లను వినియోగించి యూజర్లు సైన్ ఇన్ చేసుకోవచ్చు. అయితే డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో (మొబైల్)లను మాత్రం వాటి సంబంధిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్లాన్ ధర: రూ.398
చెల్లుబాటు కాలం: 28 రోజులు
ప్రయోజనాలు: రోజుకు 2జీబీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 12 జియోటీవీ ప్రీమియం ఓటీటీలు
ప్లాన్ ధర: రూ.1,198
చెల్లుబాటు కాలం: 84 రోజులు
ప్రయోజనాలు: రోజుకు 2జీబీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 14 జియోటీవీ ప్రీమియం ఓటీటీలు
ప్లాన్ ధర: రూ.4,498
చెల్లుబాటు కాలం: ఏడాది
ప్రయోజనాలు: రోజుకు 2జీబీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 14 జియోటీవీ ప్రీమియం ఓటీటీలు. ప్రాధాన్యత కస్టమర్ కేర్, మైజియో యాప్ వోచర్ సెక్షన్ ద్వారా అందుబాటులో జియోసినిమా ప్రీమియం కూపన్. ఈ ప్లాన్‌ను కొనడానికి సబ్‌స్ర్కైబర్లకు ఈఎంఐ సదుపాయం కూడా ఉన్నది.
డాటా యాడ్-ఆన్ వోచర్
ప్లాన్ ధర: రూ.148
చెల్లుబాటు కాలం: 28 రోజులు
ప్రయోజనాలు: 10జీబీ డాటా, 12 జియోటీవీ ప్రీమియం ఓటీటీలు