Netflix | జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్సన్ పొందే ఛాన్స్!
Netflix | నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్రీ-పెయిడ్ మొబైల్ ప్లాన్లను రిలయన్స్ జియో శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ రకమైన భాగస్వామ్యం ప్రీ-పెయిడ్ కేటగిరీలో ఇదే తొలిదని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది.
Netflix | న్యూఢిల్లీ, ఆగస్టు 18: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్రీ-పెయిడ్ మొబైల్ ప్లాన్లను రిలయన్స్ జియో శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ రకమైన భాగస్వామ్యం ప్రీ-పెయిడ్ కేటగిరీలో ఇదే తొలిదని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. ‘మా వినియోగదారులకు ప్రపంచ శ్రేణి సర్వీసులను అందివ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే మా ప్రీ-పెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ బండిల్స్‌ను ప్రారంభిస్తున్నాం’ అని జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపారు. నిజానికి ఇప్పటికే జియో పోస్ట్-పెయిడ్ ప్లాన్, జియో ఫైబర్ ప్లాన్ల ఎంపికపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తున్నది. అయితే ప్రీ-పెయిడ్ యూజర్లకు మాత్రం లేదు. తాజా ఆఫర్‌తో ప్రీ-పెయిడ్ కస్టమర్లకూ నెట్‌ఫ్లిక్స్ వినోదం అందుతున్నది. తమ ఈ ప్లాన్లతో 40 కోట్లకుపైగా జియో ప్రీ-పెయిడ్ కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ దొరుకుతుందని కంపెనీ చెప్పింది.
జియో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల వివరాలు
- 84 రోజుల వ్యవధితో జియో ప్రీ-పెయిడ్ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు
- రూ.1,099, రూ.1,499 ధరల్లో లభ్యం
- రూ.1,099 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్స్క్రిప్షన్, అన్లిమిటెడ్ 5జీ డాటా లేదా రోజుకు 2జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఉంటాయి
- రూ.1,499 ప్లాన్‌లో కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను ఒకేసారి అటు మొబైల్లో ఇటు టీవీల్లో చూడవచ్చు. అన్లిమిటెడ్ 5జీ డాటా లేదా 3జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఉంటాయి
- నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను మొబైల్ ఫోన్లలో మాత్రమే చూసేలా విడిగా రూ.149తో నెలవారీ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్
- విడిగా రూ.199 రిచార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ నెలవారీ ప్లాన్
- 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్ 2జీబీ డాటా ప్లాన్ ధర రూ.719, 3జీబీ డాటాతో రూ.999
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

