Jiomart Cashback | ఆ 3 జియో ప్రీపెయిడ్ ప్లాన్లపై జియోమార్ట్ క్యాష్ బ్యాక్
Jiomart Cashback | మూడు జియో ప్రీపెయిడ్ రీచార్జీ ప్లాన్లను జియోమార్ట్ ద్వారా రీచార్జి చేసుకుంటే 20 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Jiomart Cashback | టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లను జియోమార్ట్ నుంచి రీచార్జి చేసుకుంటే 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నది. భారత్‌లో రూ.719, రూ.666, రూ.299 ప్లాన్లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లు 28 రోజుల నుంచి 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉన్నాయి.
అంతే కాదు.. రిలయన్స్ రిటైల్ స్టోర్స్, ఇతర ఆన్లైన్ చానెల్స్‌లో వస్తు, సేవల కొనుగోలుకు జియోమార్ట్ ద్వారా చెల్లింపులు జరిపినా క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. వీటిలో రిలయన్స్ రీచార్జ్, జియోమార్ట్, రిలయన్స్ స్మార్ట్, అజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, నెట్‌మెడ్స్ ఉన్నాయి. అయితే ప్రతి కస్టమర్ ప్రతి రోజూ గరిష్ఠంగా రూ.200 క్యాష్ బ్యాక్ పొందేందుకు అర్హులు.
రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్‌పై హైస్పీడ్ డేటా వద్ద ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ పరిమితి దాటిన తర్వాత 64కేబీపీఎస్ డేటా వస్తుంది. ఈ ప్లాన్ కింద అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు.
రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ కింద రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక 28 రోజుల వ్యాలిడిటీ గల రూ.299 ప్రీ పెయిడ్ ప్లాన్‌లో 2జీబీ డేటాతోపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్సెమ్మెస్‌లు పంపవచ్చు. ఈ ప్లాన్లు రీచార్జి చేసుకున్న మూడు రోజుల్లో యూజర్ల ఖాతాల్లో క్యాష్ బ్యాక్ జమ అవుతుంది. లేదా రిలయన్స్ రిటైల్ చానెల్స్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jio prepaid
- jiomart
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

