23న జ్యుయెల్లర్స్ బంద్

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారు నగలపై హాల్‌మార్క్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం ఆభరణాల వర్తకులు ఒకరోజు నిరసనలకు దిగనున్నారు. ఈ మేరకు శుక్రవారం అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) తెలిపింది. రత్నాలు, ఆభరణాల పరిశ్రమలోని మొత్తం నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు, సమాఖ్యలు తమ ఈ స్ట్రైక్‌కు మద్దతునిస్తున్నారని ఓ ప్రకటనలో జీజేసీ పేర్కొన్నది. ఈ ఏడాది జూన్ 16 నుంచి దశలవారీ గోల్డ్ హాల్‌మార్కింగ్ అమలును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రం తెచ్చిన ఈ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ)తో ఒరిగిదేమీ లేదని నగల వ్యాపారులు అంటున్నారు. పైగా హాల్‌మార్కింగ్ కేంద్రాలు రోజుకు దాదాపు 2 లక్షల నగలపైనే హాల్‌మార్క్‌ను ముద్రించగలవని, దీంతో ఈ ఏడాదిలో ఉత్పత్తయ్యే నగలకు హాల్‌మార్క్ జరగాలంటే 3-4 ఏండ్ల సమయం పట్టవచ్చని జ్య్రుయెల్లర్స్ ప్రతినిధి మినావాలా చెప్పారు. దేశంలో ఏటా 10-12 కోట్ల ఆభరణాలు తయారవుతాయని గుర్తుచేశారు. కాబట్టి హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తే వ్యాపారం దెబ్బతింటుందని, ఇప్పటికే కరోనా పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయామని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

