Jeep Meridian | జీప్ మెరిడియన్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణ.. రూ.24.99 లక్షల నుంచి ప్రారంభం.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Jeep Meridian | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Jeep Meridian | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఐదు లేదా ఏడు సీట్లతో సీట్లతో వస్తున్న మెరిడియన్ ఫేస్ లిఫ్ట్ కారులో అదనపు ఫీచర్లు జత చేశారు. ఆసక్తి గల కస్టమర్లు ఆన్ లైన్ లో గానీ, సమీప డీలర్ల వద్ద గానీ ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. ఈ నెలఖారులో కార్ల డెలివరీ ప్రారంభం కానున్నది. జీప్ మెరిడియన్ 2025 కారు లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిలెడ్ (ఓ), ఓవర్ లాండ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. గత మోడల్ కారుతో పోలిస్తే బేస్ వేరియంట్ ధర రూ.6.24 లక్షలు తగ్గుతుందని చెబుతున్నారు. ఇక ఎంట్రీ లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ మెరిడియన్ కారు మాత్రం ఐదు సీటర్ల ఆప్షన్ తో వస్తుండగా, మిగతా వేరియంట్లు 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.
జీప్ మెరిడియన్ 2025 మోడల్ కారు ఫ్రంట్ గ్రిల్లె రీడిజైన్డ్, క్రోమ్ స్టడ్స్ మీద గల సెవెన్ స్లాట్ గ్రిల్లెతో హానీ కాంబ్ మెష్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, షార్క్ ఫిన్ ఎంటీనా, స్కిడ్ ప్లేట్లు తదితర ఫీచర్లు ఉంటాయి. ఇంటీరియర్ గా 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 9-స్పీకర్ల ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వైర్ లెస్ చార్జర్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి.
ఇక జీప్ మెరిడియన్ 2025 వేరియంట్ కారులో సేఫ్టీ కోసం అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్ విత్ కొల్లిషన్ మిటిగేసన్ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ లేన్ కీప్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, టీపీఎంఎస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ తదితర ఫీచర్లు కూడా జత చేశారు. ఫియట్ ఫియట్ నుంచి స్వీకరించిన 2.0 లీటర్ల, 4 – సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 170 హెచ్‌పీ విద్యు్త్, 370 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

