IT Returns | ఐటీఆర్‌లో రికార్డు చేయాల్సిన లావాదేవీలిలా !
IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఐటీఆర్‌లో టాక్స్‌పేయర్లు తెలపాల్సిన వివరాలను ఐటీ విభాగం ఖరారు చేసింది.
IT Returns | ప్రతి ఏడాది మాదిరిగానే గత ఆర్థిక సంవత్సర (ఐటీఆర్ ఫర్ 2021-22) ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు దగ్గర పడుతున్నది. ఒకవేళ గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే సంబంధిత పన్ను చెల్లింపు దారుపై ఆదాయం పన్నువిభాగం (ఐటీ విభాగం) పెనాల్టీ విధించడంతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయొచ్చు. ఆదాయం పన్ను విభాగం నుంచి నోటీసు రాకుండా చూసుకోవాలంటే 2021-22 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్‌లో పలు లావాదేవీల వివరాలు నమోదు చేయడం తప్పనిసరి.
ఐటీ చెల్లింపులు.. మినహాయింపులిలా
- ఈ ఏడాది పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నైనా.. పాత విధానాన్నైనా ఎంచుకోవచ్చు.
- నూతన ఐటీ విధానం ప్రకారం ఏటా రూ.2.5 లక్షల వరకే పన్ను మినహాయింపు ఉంటుంది.
- పాత విధానంలో 60 ఏండ్ల లోపు వారికి రూ.2.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- పాత విధానం కింద 60-80 ఏండ్ల మధ్య వృద్ధులకు రూ.3 లక్షలవరకు పన్ను రాయితీ కల్పించారు.
- 80 ఏండ్లు దాటిన వృద్ధు (సూపర్ సీనియర్ సిటిజన్లు)లకు రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించారు.
ఐటీఆర్-2021-22లో తప్పనిసరి నమోదు చేయాల్సిన వివరాలిలా
- ఇంటి మరమ్మతులు: ఒకవేళ మీరు గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మీ ఇంటికి మరమ్మతు చేశారా.. అయితే, ఐటీఆర్‌లోని `క్యాపిటల్ గెయిన్స్` కాలంలో మరమ్మత్తు వివరాలు చేర్చాలి.
- ఆస్తుల క్రయ విక్రయాలు: ఒకవేళ 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2022 మార్చి 31 వరకు ఆస్తులు విక్రయించినా ఐటీఆర్‌లోని క్యాపిటల్ గెయిన్స్ కాలంలో నమోదు చేయాలి.
- విదేశాల్లో ఆస్తులు: ఒకవేళ విదేశీ గడ్డపై మీకు సొంత ఇల్లు ఉన్నా.. ఐటీఆర్‌లో తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిందే. దీనికి అదనంగా విదేశాల్లో మీకు వచ్చే ఆదాయం వివరాలు తెలుపాలని మిమ్మల్ని ఆదాయం పన్ను విభాగం అడగవచ్చు.
- ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్ ఖాతా) : ఒకవేళ మీరు పీఎఫ్ ఖాతాలో జమ చేసిన నిధులపై ఏటా రూ.2.5 లక్షలకు పైగా వడ్డీ ఆదాయం పొందుతున్నట్లైతే.. ఆ వివరాలను ఐటీఆర్‌లో నమోదు చేయాల్సిన అవసరం ఉంది.
- ఆస్తుల వాస్తవ విలువ: ఇప్పటివరకు క్రయ, విక్రయాలు చేసిన ఆస్తుల విలువను ఐటీఆర్‌లో నమోదు చేయాల్సిన అవసరం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల క్రయ, విక్రయాల్లో వాటి వాస్తవ విలువను తెలియజేయాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

