Itel S24 | గ్లోబల్ మార్కెట్లో ఐటెల్ ఎస్24.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Itel S24 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) తన ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Itel S24 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) తన ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ హెలియో (MediaTek Helio G91) ప్రాసెసర్‌తో వస్తున్నది. త్రీ ర్యామ్ విత్ స్టోరేజీ కాన్ఫిగరేషన్స్, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నేచురల్ లైట్ మీద పడినప్పుడు ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ చేంజ్ అయ్యేలా ‘కలర్ చేంజింగ్ ఫోటోక్రోమింగ్ టెక్నాలజీ’తో వస్తున్నది. భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కోస్ట్ లైన్, డాన్ వైట్, స్టారీ బ్లాక్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ 6.6 అంగుళాల హెచ్డీ+ (1612x 720 పిక్సెల్స్) స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. 480 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ ప్రాసెసర్ తో ఫోన్ పని చేస్తుంది.
108-మెగాపిక్సెల్ శాంసంగ్ ఐఎస్ఓసీఈఎల్ఎల్ హెచ్ఎం6 సెన్సర్ విత్ ఎఫ్/1.6 అపెర్చర్, 3ఎక్స్ సెన్సర్ జూమ్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్), క్యూవీజీఏ డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ మద్దతుతో పని చేస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ డైనమిక్ బార్ ఫీచర్ ఉంటుంది. ఈ డైనమిక్ బార్ ఫీచర్.. బ్యాటరీ చార్జింగ్, ఇన్ కమింగ్ కాల్ అలర్ట్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఐటెల్ ఓఎస్ 13 వర్షన్ తో పని చేస్తుంది. 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 40 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. 4జీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

