IT Hiring | సాఫ్ట్వేర్ డెవలపర్లకు ఫుల్ గిరాకీ.. వచ్చే ఏడాది 8.5 శాతం నియామకాలు వృద్ధి..!
IT Hiring | ఐటీ రంగ కంపెనీలు మాంద్యం నుంచి క్రమంగా పుంజుకుంటున్నాయి. వచ్చే ఏడాది లోపు కొత్త నియామకాలు 8.4 శాతం వృద్ధి చెందుతాయని ఓ నివేదిక వెల్లడించింది.
IT Hiring | ఐటీ సంస్థలు మాంద్యం ప్రభావం నుంచి క్రమంగా పుంజుకుంటున్నాయి. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త నియామకాల ప్రక్రియ వేగవంతం చేస్తున్నాయి. వచ్చే ఏడాది లోపు 8.5 శాతం ‘ఐటీ కొలువు’ల నియామకాలు పెరుగుతాయని గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ అండ్ ప్లాట్ ఫామ్ ‘రిక్రూట్ హోల్డింగ్స్’ అనుబంధ సంస్థ ఇండీడ్ ఇండియా పేర్కొంది. ఐటీ కంపెనీల్లో 70 శాతం సాఫ్ట్ వేర్ రోల్స్ నిర్వహణకు అవసరం అని ఆ నివేదిక సారాంశం. సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ టూల్స్ అడాప్షన్ వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ప్రాధాన్యం పెరుగుతోందని ఇండీడ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాఫ్ట్ వేర్ టూల్స్‌లో కొత్త ఫీచర్లు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కోసం వృత్తి నిపుణులకు డిమాండ్ నికరంగా కొనసాగుతున్నది.
‘అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, పీహెచ్‌పీ డెవలపర్ల నియామకాలు ఐటీ కంపెనీలు చురుగ్గా సాగిస్తున్నాయి. వీటిపాటు నెట్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్స్, డెవ్ ఆప్స్ ఇంజినీర్లు, డేటా ఇంజినీర్లు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్లకూ గిరాకీ పెరుగుతున్నది.
‘ఐటీ రంగం నిరంతరం భారీ ఉద్యోగాల కల్పనకు పవర్ హౌజ్. కానీ ఇటీవలి మాంద్యం ప్రభావంతో నియామకాలు తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఐటీ కంపెనీలు నియామకాలు చేపడతున్నాయి. సాఫ్ట్ వేర్ అండ్ టెక్నాలజీ రోల్స్ నిర్వహణకు కొత్తగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఏర్పాటు చేస్తాయని అంచనా వేస్తున్నారు’ ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

