టెకీలకు బొనాంజా : ఐదేండ్లలో అందుబాటులోకి 50 లక్షల ఉద్యోగాలు!
భారత్‌లో రానున్న ఐదేండ్లలో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్, దేశీ వారెన్ బఫెట్‌గా పేరొందిన రాకేష్ ఝన్‌ఝన్‌వాలా అన్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లో రానున్న ఐదేండ్లలో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్, దేశీ వారెన్ బఫెట్‌గా పేరొందిన రాకేష్ ఝన్‌ఝన్‌వాలా అన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రముఖ స్టాక్ ట్రేడర్ ఝన్‌ఝన్‌వాలా భారత ఐటీ రంగం ఎదుగుదలపై ఆశాభావం వ్యక్తం చేశారు. మహమ్మారి అనంతరం ఎకానమీ తిరిగి గాడినపడుతున్న తీరుకు నియామకాల జోరు సానుకూల సంకేతంలా నిలుస్తోంది.
హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందని ట్యాగ్డ్ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ఆధారంగా 50 లక్షల ఐటీ ఉద్యోగాలు రానున్నాయని రాకేష్ అంచనా వేశారు. 2022లో చేపట్టే నియామకాల్లో 56 శాతం కంటే అధికంగా 0-5 ఏండ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ అధికంగా ఉంటారని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి విభాగాల్లో మెరుగైన నైపుణ్యాలు కలిగిన వారికి అత్యధిక డిమాండ్ నెలకొందని ఈ సర్వే వెల్లడించింది.
ఫ్రెషర్స్, రెండేండ్ల లోపు అనుభవం ఉన్న వారికి ఐటీ పరిశ్రమలో అధిక డిమాండ్ ఉందని విప్రో, చీఫ్ హ్యూమన్ రిలేషన్స్ అధికారి సౌరవ్ గొహిల్ పేర్కొన్నారు. ఇంజనీరేతర ఫ్రెషర్స్ హైరింగ్‌ను తాము రెట్టింపు చేశామని, ఉద్యోగుల్లో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. ఇక కరోనా మహమ్మారి తర్వాత వ్యాపారాలు తిరిగి గాడినపడటం, కంపెనీలు ఐటీ వ్యయాలపై వెచ్చించేందుకు సిద్ధం కావడంతో నూతన ప్రాజెక్టులు రానున్నాయి. కొత్త ప్రాజెక్టుల్లోనూ పెద్దసంఖ్యలో కొలువుల అవసరం ఏర్పడనుండటంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

