iQoo 12 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ 12 సిరీస్ (iQoo 12 Series) ఫోన్లు ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్లో ఐక్యూ11, ఐక్యూ 11 ప్రో ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐక్యూ 12 సిరీస్ ఫోన్ శాంసంగ్ ఈ7 అమోలెడ్ డిస్ ప్లే విత్ 2కే రిజొల్యూషన్, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ఓవీ50హెచ్ ప్రైమరీ సెన్సర్, 64 మెగా పిక్సెల్ ఓవీ64బీ పెరిస్కోప్ లెన్స్ కెమెరా ఉంటాయి. ఇంకా టెలిఫొటో, ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా డిటైల్స్ వెల్లడించలేదు.
ఐక్యూ 12 ఫోన్ బేస్ వేరియంట్ 100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఐక్యూ 12 ప్రో వేరియంట్ 200 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు. ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, యూఎస్బీ టైప్-సీ 3ఎక్స్ పోర్ట్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆర్జిన్ ఓఎస్ వర్షన్ పై ఫోన్ పని చేస్తుంది. 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్స్ ఇన్ బిల్ట్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది.