iQoo 12 Series | భారత్ మార్కెట్లోకి ఆ చిప్‌తో వచ్చే తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనా..?!
iQoo 12 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ఐక్యూ12, ఐక్యూ12 ప్రో ఫోన్లను నవంబర్ 7న ఆవిష్కరించనున్నది.
iQoo 12 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) తన ఐక్యూ12 సిరీస్ (iQoo 12 Series) ఫోన్లను నవంబర్ 7న చైనాలో ఆవిష్కరించనున్నది. డిసెంబర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. అయితే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్సెట్తో టెక్నాలజీతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్లు ఐక్యూ12, ఐక్యూ12 ప్రో. భారత్ మార్కెట్లోకి కూడా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదేనని ఐక్యూ ఇండియా సీఈఓ నిపుణ్ మౌర్య వెల్లడించారు.
ఐక్యూ12, ఐక్యూ12 ప్రో ఫోన్లు ఆండ్రాయిడ్ 14 వర్షన్‌పై పని చేస్తాయని తెలుస్తున్నది. ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో ఐక్యూ12 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లూ 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తున్నాయి. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 2కే రిజొల్యూషన్‌తో కూడిన శాంసంగ్ ఈ7 అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుందీ ఫోన్. ఐక్యూ12 సిరీస్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి వెసులుబాటు ఉంటుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఐక్యూ12 సిరీస్ ఫోన్లలో 50-ఎంపీ ఓమ్నీ విజన్ ఓవీ50హెచ్ సెన్సర్ విత్ ఓఐఎస్, 50-ఎంపీ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్ 1 సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64-ఎంపీ ఓవీ64 బీ టెలిఫొటో సెన్సర్ విత్ 3 ఎక్స్ జూమ్ ఐఓఎస్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఐక్యూ12లో 4880 ఎంఏహెచ్ డ్యుయల్ సెల్ బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐక్యూ12 ప్రోలో 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ / 50 వాట్ల వైర్లెస్ చార్జింగ్ మద్దతు గల 4,980 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
#iQOO12 + #Snapdragon8Gen3 = The ultimate performance duo. #ComingSoon pic.twitter.com/DUQKwqeXBF
— Nipun Marya (@nipunmarya) October 25, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

