iPhone 15 | ఐ-ఫోన్ ప్రియులకు షాక్.. ఐ-ఫోన్ 15 లాంచింగ్ ఆలస్యం.. కారణం అదేనా..?!
iPhone 15 | ఈ ఏడాది ఆపిల్ ఐ-ఫోన్ 15 మార్కెట్లో ఆవిష్కరణ నెలరోజులు జాప్యం అవుతుందని తెలుస్తున్నది. దీనికి సాంకేతిక అంశాలే కారణమని సమాచారం.
iPhone 15 | ప్రతి ఏడాది మాదిరిగానే ఆపిల్ ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసే ‘ఐ-ఫోన్ 15’ ఒక నెల రోజులు ఆలస్యంగా వస్తు్న్నట్లు తెలుస్తున్నది. ఐ-ఫోన్ల విడుదలకు ముందే మార్కెట్లో ఓ ట్రెండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫోన్ కోసం ఫోన్ ప్రియులు ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవంగా ప్రతియేటా సెప్టెంబర్‌లో ఐ-ఫోన్ విడుదల చేసి, తర్వాత కొన్ని రోజులకు సేల్స్ ప్రారంభిస్తుంది ఆపిల్. ఇంతకుముందు కూడా కొవిడ్-19 వల్ల 2020లో మార్కెట్లో ఆలస్యంగా ఐ-ఫోన్ 12 ఆవిష్కరించారు. వివిధ మ్యాగజైన్లు, వెబ్ సైట్లలో వచ్చిన వార్తల ప్రకారం వచ్చే అక్టోబర్‌లో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆవిష్కరిస్తుంది. దీనికి స్క్రీన్ మాన్యుఫాక్చరింగ్ అంశాలే కారణమని తెలుస్తున్నది.
సెప్టెంబర్‌లో ఐ-ఫోన్ విడుదల చేసే సమయానికి ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు తగినంత అందుబాటులో ఉండనందునే లాంచింగ్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో మోడల్స్‌లో వినియోగించే డిస్ ప్లే తయారీ సంస్థలు కొత్త మాన్యుఫాక్చరింగ్ ప్రక్రియ అనుసరించడం, డిస్ ప్లే టెస్టింగ్‌లో ఎల్జీ సంస్థకు అంతరాయం ఏర్పడటమే ఆలస్యానికి కారణమని తెలుస్తున్నది. కొవిడ్-19 మహమ్మారి వేళ కూడా ఐ-ఫోన్ 12 సిరీస్ ఫోన్ల విడుదలకు ఇటువంటి అంతరాయమే ఏర్పడింది. ఈ దఫా ఆపిల్.. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్లస్, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

