Intel CEO Pat Gelsinger | ఇంటెల్ సీఈఓగా పాట్ గెల్సింగర్ రిటైర్మెంట్.. ఇద్దరు కో సీఈఓలను ప్రకటించిన కంపెనీ..!
Intel CEO Pat Gelsinger | గ్లోబల్ టెక్ దిగ్గజం ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ కంపెనీ నుంచి వైదొలిగారు. 40 ఏండ్లుగా కెరీర్లో కొనసాగిన పాట్ గెల్సింగర్.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి రిటైర్ అయ్యారు.
Intel CEO Pat Gelsinger | గ్లోబల్ టెక్ దిగ్గజం ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ కంపెనీ నుంచి వైదొలిగారు. 40 ఏండ్లుగా కెరీర్లో కొనసాగిన పాట్ గెల్సింగర్.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి రిటైర్ అయ్యారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆయన రిటైర్మెంట్ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటెల్ యాజమాన్యం ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తాత్కాలిక కో సీఈఓలుగా నియమించింది. డేవిడ్ జిన్స్నర్, మిచెల్లె జాన్టన్ హోల్థౌస్లను తాత్కాలిక కో సీఈఓలుగా నియమించినట్లు సోమవారం తెలిపింది.
కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఇండిపెండెంట్ చైర్‌గా ఉన్న ఫ్రాంక్ ఇయరీ.. కంపెనీ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఇంటెల్ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ ఫౌండ్రీ నాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. జెన్స్నర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కం చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా ఉంటారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటెల్ ప్రొడక్ట్స్ సీఈఓగా హోల్టౌస్ ఉంటారు. ఈ ఇంటెల్ ప్రొడక్ట్స్ గ్రూపులో కంపెనీ క్లయింట్ కంప్యూటింగ్ గ్రూప్ (సీసీజీ), డేటా సెంటర్ అండ్ ఏఐ గ్రూప్ (డీసీఏఐ), నెట్ వర్క్ అండ్ ఎడ్జ్ గ్రూప్ (ఎన్ఈఎక్స్) ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

