Instagram : సోషల్ మీడియా యూజర్లను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ సంఖ్యలో కోట్లాది మంది డేటాను హ్యాకర్లు ఈమధ్యే ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. నకిలీ క్రిప్టోకరెన్సీ రిటర్న్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ యూజర్ల డేటాను కూడా దొంగిలించే ప్రయత్నం చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూజర్ల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో హ్యాకర్ల బారిన పడిన అకౌంట్‌ను తిరిగి పొందే వీలుంటుంది. అంతేకాదు తమ అకౌంట్‌ను ఓపెన్ చేయడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా యూజర్లు రిపోర్ట్ చేయొచ్చు. instagram.com\hacked సైట్ ద్వారా యూజర్లు తమ అకౌంట్‌ను తిరిగి పొందే వీలుంది.
‘ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ కానప్పుడు యూజర్ల ఎంత ఒత్తిడికి లోనవుతారనేది మాకు తెలుసు. అందుకనే వాళ్లకు ఖాతాను తిరిగి పొందేందుకు పలు అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చాం’ అని ఇన్స్టాగ్రామ్ బ్లాగ్స్పాట్ పోస్ట్‌లో తెలిపింది. అంతేకాదు ఒకవేళ అకౌంట్ లాక్ అయితే దానిని అన్‌లాక్ చేసేందుకు ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫీచర్ కూడా తెచ్చింది. అయితే, ముందుగానే ఇద్దరు ఫ్రెండ్స్‌ను ఐడెంటిటీని వెరిఫై కోసం సెలక్ట్ చేసుకోవాలి.