Infinix Smart 8 Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ (Infinix Smart 8 Plus) ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ మ్యాజిక్ రింగ్ ఫీచర్, ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ వర్షన్ మీద పని చేస్తుంది.
గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ (Infinix Smart 8 Plus). 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,999 పలుకుతుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై రూ.1000 డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ (Infinix Smart 8 Plus) ఫోన్.. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.6-అంగుళాల హెచ్డీ+ (1612×720 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. 12ఎన్ఎం మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటుంది. వర్చువల్‌గా మరో 4జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 2 టిగా బైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.
50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్, క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ సెన్సర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఆపిల్ ఐ-ఫోన్లలో డైనమిక్ ఐలాండ్ తరహాలో మ్యాజిక్ రింగ్ ఫీచర్ ఉంటుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ (Infinix Smart 8 Plus) ఫోన్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.