Infinix Smart 8 Plus | మార్చి ఒకటో తేదీన ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!
Infinix Smart 8 Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్‌ను శుక్రవారం (మార్చి 1) భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Infinix Smart 8 Plus | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ (Infinix Smart 8 Plus) ఫోన్‌ను శుక్రవారం (మార్చి 1) భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఏడాది ప్రారంభంలోనే సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ ఫీచర్లతో వస్తున్నది.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ జీ36 ఎస్వోసీ చిప్సెట్, 4జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్లు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు మ్యాజిక్ రింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇప్పటికైతే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ ధర అధికారికంగా వెల్లడించకున్నా, రూ.7,000 లోపే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్సెట్, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో వస్తున్నది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్. వర్చువల్‌గా మరో 8 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 2 టిగా బైట్స్ వరకు విస్తరించవచ్చు.
యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సాయంతో 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నదీ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్. సింగిల్ చార్జింగ్‌తో 47 గంటల టాక్ టైం, 90 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్, 45 గంటల వీడియో ప్లే బ్యాక్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. డిస్ ప్లే నోటిఫికేషన్ల కోసం ఫ్రంట్ కెమెరా చుట్టూ పిల్ షేప్డ్ యానిమేషన్ ఉంటుంది. ఇది ఆపిల్ ఐ-ఫోన్లలో డైనమిక్ ఐలాండ్ మాదిరిగా పని చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.6 -అంగుళాల ఐపీఎస్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ ప్లే, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

