Infinix Smart 8 HD | బడ్జెట్ ధరలో ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Infinix Smart 8 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ బడ్జెట్ ధరలో తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Infinix Smart 8 HD | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుంది. పిల్ ఆకారంలో మ్యూజిక్ రింగ్ ఈ ఫోన్ స్పెషాలిటీ.
భారత్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్ కేవలం 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా లభిస్తుంది. 3జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 6 జీబీ వరకూ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో రెండు టిగాబైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ విస్తరించుకోవచ్చు. దీని ధర రూ.7,990 అని అమెజాన్ తెలిపింది. సెలెక్టెడ్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రాయితో కలుపుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,669లకే లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 వర్షన్‌పై ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్ పని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల హెచ్డీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ యూనీసోక్ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్లో మ్యూజిక్ రింగ్ అనే సాఫ్ట్ వేర్ వల్ల డిస్ ప్లే పై భాగంలో నాచ్ చుట్టూ పిల్ ఆకారంలో చార్జింగ్ యానిమేషన్లు, బ్యాగ్రౌండ్ కాల్స్‌లో బ్యాటరీ రిమైండర్స్తోపాటు ఇతర నోటిఫికేషన్లు కనిపిస్తాయి.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్ 13 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అన్‌లాక్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

