Infinix Note40 Pro | బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Infinix Note 40 Pro | ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్లను బడ్జెట్ ధరలోనే భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Infinix Note 40 Pro | ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ (Infinix Note 40 Pro) ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ((Infinix Note 40 Pro 5G), ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G) పేర్లతో వస్తున్న ఈ ఫోన్లు బడ్జెట్ ధరలోనే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. రెండు ఫోన్లూ 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే, 108 మెగా పిక్సెల్ మెయిన్ కమెరా, 20 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లకూ రివర్స్ చార్జింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. భారత్ మార్కెట్లో టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘ఫ్లిప్ కార్ట్’ ద్వారా విక్రయిస్తారు. ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తాయి.
రెండు ఫోన్లూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 3డీ కర్వ్ డ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 1080×2436 పిక్సెల్స్ రిజొల్యూషన్ ఉంటుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. ఇందులో 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు రెండు ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్ 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. రెండింటికీ 20వాట్ల వైర్ లెస్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ తో వస్తున్న రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

