హైదరాబాద్, సెప్టెంబర్ 27: శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్కు చెందిన ఇన్ఫినిటీ లర్న్ అంచనాలకుమించి రాణిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.
సేవలు ప్రారంభించి రెండేండ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. 2021-22లో రూ.2.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన విషయం తెలిసిందే.