Willie Walsh | ఇండిగో ఎయిర్‌లైన్స్ నూతన సీఈవోగా విల్లీ వాల్ష్.. బాధ్యతల స్వీకరణ ఎప్పటినుంచంటే
Willie Walsh : ఇండిగో ఎయిర్‌లైన్స్ నూతన సీఈవోగా విల్లీ వాల్ష్ నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ సంస్థ సీఈవోగా ఉన్న పీటర్ ఎల్బర్స్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Willie Walsh : ఇండిగో ఎయిర్‌లైన్స్ నూతన సీఈవోగా విల్లీ వాల్ష్ నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ సంస్థ సీఈవోగా ఉన్న పీటర్ ఎల్బర్స్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సీఈవో కోసం చూసిన సంస్థ.. విల్లీ వాల్ష్‌ను నియమించుకుంది. విల్లీ వాల్ష్ గతంలో బ్రిటీష్ ఎయిర్వేస్, ఐఏజీ సంస్థలకు సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ)గా వ్యవహరిస్తున్నారు.
ఆయన నియామకంపై ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా స్పందించారు. విల్లీ తమ సంస్థలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్ విభాగంలో ఎన్నో విజయాలు అందుకున్న విల్లీ వాల్ష్ తమ సంస్థకు నాయకత్వం వహించనుండటం ఆనందంగా ఉందన్నారు. అలాగే, ఇండిగోలో తన చేరికపై విల్లీ వాల్ష్ కూడా ప్రకటన చేశారు. ఇండిగో సంస్థను నడిపించబోతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్థకు గొప్ప పునాది, గుర్తింపు ఉందని, సంస్థ కోసం బాధ్యతతో పని చేస్తానని తెలిపారు. ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను నడిపించడానికి కృషి చేస్తానని వెల్లడించారు. ప్రస్తుతం ఐఏటీఏలో పని చేస్తున్న విల్లీ వాల్ష్ ఈ సంస్థలో తన పదవీకాలాన్ని ఈ ఏడాది జూలై 31 వరకు నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఆగష్టు 3 నుంచి ఆయన ఇండిగో సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంతకుముందు సీఈవోగా పని చేసిన పీటర్ ఎల్బర్స్ ఇటీవలే రాజీనామా చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఇండిగో విమానాలు చాలారోజులపాటు క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సంస్థపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆయన పదవీ కాలం ఇంకా 18 నెలలు ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

