ముంబై, మే 2: చౌక విమానయాన సంస్థ ఇండిగో.. ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రత్యేక బోనస్‌ను ప్రకటించింది సంస్థ. 30 అతిపెద్ద ఏ350 విమానాల ఆర్డర్లు వచ్చిన వారం రోజుల తర్వాత, ఆర్థిక ఫలితాలు విడుదల చేయడాని కంటే ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రత్యేక బోనస్ కింద సిబ్బంది 1.5 నెలల బేసిక్ వేతనాన్ని అందించనున్నది. ఈ బోనస్‌ను మే నెల వేతనంతోపాటు అందించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.